రెండు సార్లు జగన్ బ్రతిమాలినందుకు రామోజీ రావు చేసింది ఇదే!

YS Jagan Ramoji Raoప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి తన సహజ శైలికి విరుద్ధంగా రామోజీ రావు వద్దకు వెళ్లి పాదయాత్రను ఆశీర్వదించాల్సిందిగా రిక్వెస్ట్ చేసారు. వైఎస్సాఆర్ బద్ద శత్రువులా చుసిన రామోజీ రావుతో జగన్ సంధి చేసుకోవడం ఆయన మద్దత్తు దారులకు కూడా నచ్చలేదు. అయితే కాళ్ళ బేరానికి వెళ్లిన జగన్ కు రామోజీ రావు సహకరించేలా కనిపించడంలేదు.

ADVERTISEMENT

ఈరోజు ఈనాడు పేపర్లో పారడైస్ పేపర్స్ లో ఉన్న తాజా జగన్ లింక్స్ బయటపెట్టింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త పొట్లూరి వర ప్రసాద్ (పీవీపీ) మారిషస్‌లో ఓ కంపెనీని ప్రారంభించి దాని ద్వారా కొన్ని వందల కోట్ల పెట్టబడులను స్వదేశంలోని కంపెనీలకు ప్రవహింపచేశారు. అలా వచ్చిన సొమ్మునే జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడి పెట్టారు.

ప్రతిఫలంగా వైఎస్ హయాంలో పీవీపీ కంపెనీలకు భూకేటాయింపులు జరిగాయి. అప్పు ఇచ్చిన సంస్థల్లో భాగస్వామిగా ఉన్న ఒక కంపెనీ మారిషస్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. తమ అంగీకారం లేకుండా భారత కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి, అక్కడి నుంచి థర్డ్‌ పార్టీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపించింది.

అయితే ఈ వార్త ఈనాడు ప్రచురించడం మానలేదు. కాకపోతే మెయిన్ పేజీలో చిన్న బాక్స్ ఐటెంగా ఇచ్చి అసలు వార్త 14వ పేజీలో ఇచ్చారు. రెండు సార్లు కలిసి బ్రతిమాలినందుకు రామోజీ రావు జగన్ కు చేసిన సాయం ఇదే. సహజంగానే జగన్ కు ఇది రుచించదు అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

ADVERTISEMENT
Latest Stories