ఎన్నికలలో ఓడిపోయినవారు నిత్యం మీడియా, ప్రజల దృష్టిలో ఉంటూ తమ ఉనికిని కాపాడుకుంటారు. అందుకు వారు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ జాబితాలో పరువు నష్టం దావా కేసు వేయడం కూడా ఒకటి. అప్పటి నుంచి వార్తలలో హైలైట్ అవుతుంటారు.
Also Read – సీక్వెల్స్: వైఫల్యం నుండి విజయం వరకు
తెలంగాణలో మంత్రి కొండా సురేఖపై కేటీఆర్, అక్కినేని నాగార్జున చెరో వందకోట్లకు పరువు నష్టం దావాలు వేశారు. కోలీవుడ్‌లో ధనుష్ నయనతార దంపతులపై పరువునష్టం దావా వేశారు.
తాజాగా జగన్ కూడా టీడీపీ, ఈనాడు, ఆంద్రజ్యోతి మీడియా ఛానల్స్‌పై వందకోట్లకు పరువునష్టం దావా వేస్తానని నిన్న హెచ్చరించారు.
Also Read – జగన్ చివరి ఆశ అదే?
కనుక పరువు ఖరీదు వంద కోట్లు అనుకుంటే, పోయిన ఆ పరువుని వంద కోట్ల దావాతో తిరిగి సంపాదించుకోవచ్చని అర్దమవుతోంది. కనుక పరువు నష్టం దావాలు కూడా మరో కొత్త ఆదాయ మార్గంగా భావించవచ్చు.
ఇలా దావాలు వేసి సులువుగా వంద కోట్లు సంపాదించుకునే వెసులుబాటు ఉండగా కష్టపడటం దేనికని సామాన్య ప్రజలకు ధర్మ సందేహం కలిగితే తప్పుకాదు.
Also Read – కేసీఆర్ చరిత్రని రేవంత్ తుడిచేయగలరా?
జగన్ పరువు అంటే ఆంధ్రా పరువు… కనుక దాని కోసమే తాపత్రాయపడదాము. అదానీ నుంచి తాను 1,750 కోట్లు తీసుకున్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని, సెకీ-ఏపీ ప్రభుత్వానికి మద్యన విద్యుత్ కొనుగోలుకి ఒప్పందం జరిగితే, తాను అదానీతో బేరం కుదుర్చుకొని ముడుపులు స్వీకరించానని దుష్ప్రచారం చేస్తున్నాయని జగన్ ఆవేదన చెందారు.
ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందం ద్వారా రాష్ట్రానికి లక్ష కోట్లు మిగిల్చిన తనకు శాలువా కప్పి సన్మానం చేయాల్సి ఉండగా అవినీతిపరుడిని అంటూ టీడీపీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి తన గురించి దుష్ప్రచారం చేస్తున్నాయని, తద్వారా తాను ఎంతో కష్టపడి సంపాదించుకున్న పరువుకి భంగం కలిగిస్తున్నాయని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిపై వంద కోట్లు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
ఒకవేళ జగన్ దావా వేస్తే అప్పుడు ఈ అదానీ ముడుపుల భాగోతంపై మరింత లోతుగా చర్చ జరుగుతుంది. ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశిస్తే ముడుపుల నిజాలు ఫైల్స్ కట్టలు తెంచుకొని బయటపడే అవకాశం ఉంటుంది. కనుక వంద కోట్ల విలువైన పరువు కోసం జగన్ ప్రాకులాడితే బ్యాలన్స్ పరువు కూడా పోయే ప్రమాదం ఉంది.