మహేష్ వెనుక ఉన్న జగన్!

Who is Behind Mahesh Kathi‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ తెలియనిది కాదు. భారీ ప్రేక్షకాభిమానం సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ సమకాలీన రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఓ మంత్రి తన విధి నిర్వహణలో భాగంగా అధికారులకు ఏదైనా ఆదేశాలు జారీ చేస్తే పనులు అవుతాయో లేదో గానీ, ఒక సమస్యపై పవన్ కళ్యాణ్ ఒక చిన్న ట్వీట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దానికి ప్రభుత్వం నుండి స్పందన లభిస్తుంది. అంత ‘పవర్ ఫుల్’ వ్యక్తి పైన, ‘బిగ్ బాస్’ ముందు వరకు అసలెవరో తెలియని మహేష్ కత్తి అనే ఓ ‘సినీ విశ్లేషకుడు’ కొంతకాలంగా తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT

తాజాగా ట్విట్టర్ పవన్ చేసిన చిన్న పొరపాటుపై ‘సెన్స్ లేదంటూ’ పెద్ద ఎత్తున ‘కత్తి’ విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ను విమర్శించే ధైర్యం గానీ, స్థాయి గానీ ఎక్కడ నుండి వచ్చింది? ఎవరు ఈ మనోబలాన్ని ఇచ్చారు? ఓ పక్కన పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో వార్నింగ్ లు ఇస్తున్నా, మహేష్ కత్తి ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవడం వెనుక కారణాలేంటి? అన్న నేపథ్యంలో తలెత్తుతున్న ప్రశ్నలకు సరికొత్త పుకారు ప్రాణం పోసుకుంది. అవును… పవన్ పై ‘దండయాత్ర’ చేయడంలో ‘కత్తి’ వెనుక మరో ‘శక్తి’ ఉందన్న పుకారు ఇప్పుడు వైరల్ అవుతోంది.

పవన్ కళ్యాణ్ టీడీపీకి అనుకూలంగా ఉండటంతో… జనసేనను దెబ్బకొట్టడానికి, పవన్ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడానికి వైసీపీ అధినేత జగనే ఈ తతంగాన్ని నడిపిస్తున్నారంటూ వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. పవన్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టడం ద్వారా, ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలనేదే వైసీపీ వర్గీయుల ప్లాన్ గా అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల జరిగిన ఓ లైవ్ ఇంటర్వ్యూలో… 2014 ఎన్నికల్లో జగన్ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్నారు కదా? అనే ప్రశ్నకు ‘ఔను’ అంటూ జవాబిచ్చిన కత్తి మహేష్ వ్యాఖ్యలు కూడా… ఈ పుకార్లకు బలం చేకూరుస్తోందని టాక్. నిజం నిలకడ మీద తేలాల్సిందే!

ADVERTISEMENT
Latest Stories