హాట్ హాట్ సినిమాలకు బాలీవుడ్ కేరాఫ్ అడ్రస్ గా మారుతుందన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే త్వరలో “జూలీ 2” రూపంలో మరో హాట్ మూవీ ప్రేక్షకులకు కన్నులవిందు చేసేందుకు సిద్ధమవుతోంది. గతంలో నేహా ధూపియా ప్రధాన పాత్రలో తెరకెక్కిన “జూలీ” సినిమా సూపర్ సక్సెస్ కావడంతో, దానికి సీక్వెల్ గా లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలో ఈ సినిమాను తెరకెక్కించారు. లక్ష్మీ రాయ్ ‘బ్యాక్ లెస్’ పోస్టర్స్ ఇప్పటికే ఈ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీని తెచ్చిపెట్టగా, యువతను ఊరిస్తున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ మంగళవారం నాడు విడుదల కాబోతోంది.
సోషల్ మీడియా మాధ్యమాలైన ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లతో పాటు యూ ట్యూబ్ లో మంగళవారం నాడు మధ్యాహ్నం 2.30 నిముషాలకు “జూలీ 2” టీజర్ విడుదల కాబోతుందని ప్రకటిస్తూ… ఈ సినిమాలోని మరో సెక్సీ పోస్టర్ ను విడుదల చేసింది రాయ్. షార్ట్ డ్రెస్ వేసుకుని బైక్ పక్కన వెనుక నుండి ఇచ్చిన లక్ష్మీ రాయ్ స్టిల్, ఈ సినిమా టీజర్ ద్వారా ఏం చూపించబోతున్నారో చెప్పకనే చెప్తోంది. ప్రేక్షకులను తన సోయగాల సౌందర్యంతో తడిపి ముద్ద చేయనుందని బాలీవుడ్ వర్గాలు కూడా కోడై కూస్తున్నాయి. ఈ దెబ్బతో బాలీవుడ్ లో పాతుకుపోవాలని, కాస్త బోర్డర్ దాటిందనే టాక్ అయితే బలంగా ఉంది.


