హైదరాబాద్ మేయర్ పీఠంపై కూర్చోబోయేది తేలింది!

who will be the hyderabad meyorజీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 స్థానాలతో విజయబావుట ఎగురవేసిన టీఆర్ఎస్ పార్టీ రేపు మేయర్ ను ఎంపిక చేయనుంది. అయితే దీనిపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన పార్టీ వర్గీయులు టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి బొంతు రామ్ మోహన్ ను ఫైనల్ చేసినట్లుగా సమాచారం.

చివరి నిముషం వరకు రేగిన ఉత్కంఠలో రామ్ మోహన్ మరియు కేశవరావు కుమార్తె విజయలక్ష్మిల మధ్య తీవ్ర పోటీ నెలకొందని, అయితే చివరికి బొంతు రామ్ మోహన్ వైపుకే పార్టీ వర్గాలు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే, డిప్యూటీ మేయర్ కుర్చీలో పిజేఆర్ కుమార్తె విజయారెడ్డిని ఎంపిక చేసినట్లుగా సమాచారం. సదరు అధికారిక సమాచారాన్నంతా రేపు టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా వెలువరించనుంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories