నందీ అవార్డులు అడిగినా ఇవ్వరా… ఏం?

Actor R Narayana Murthy speaking about the revival of Nandi Awards as debate grows after Telangana government announced Gaddar Awards.

తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు గద్దర్ అవార్డులు ఇస్తోంది. ఇటీవలే అవార్డుల జాబితా కూడా వెల్లడించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కూడా నంది అవార్డులు ఇవ్వాలని ప్రముఖ నటుడు ఆర్‌. నారాయణ మూర్తి విజ్ఞప్తి చేశారు.

నంది అవార్డుల కోసం గతంలో కూడా పలువురు సినీ ప్రముఖులు విజ్ఞప్తి చేసినప్పటికీ ఏపీ ప్రభుత్వం స్పందించ లేదు! కారణం… ఒకటి కాదు చాలానే ఉన్నాయి. క్లుప్తంగా చెప్పుకుంటే…

ADVERTISEMENT

1. ఏపీ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు దగ్గర సంబంధాలున్నాయి. అందువల్లే భారీ బడ్జెట్‌ తెలుగు సినిమాలకు ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంచుకునేందుకు, అదనపు షోలు వేసుకునేందుకు అనుమతిస్తూనే ఉంది. అయినా సినీ పరిశ్రమని ఏపీకి తరలి రావాలని లేదా కనీసం ఏపీకి విస్తరించాలని సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ ముగ్గురూ స్వయంగా ఆహ్వానించినా ఎవరూ స్పందించలేదు. అలాంటప్పుడు సినీ పరిశ్రమకు నంది అవార్డులు ఇవ్వడం దేనికి? అనుకొని ఉండవచ్చు.

2. ఏపీ ప్రభుత్వంలో సినీ పరిశ్రమకు చెందిన నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్‌, నాగబాబు ఉన్నారు. కనుక నంది అవార్డులు ఇచ్చినా తమ వాళ్ళకే ఇచ్చుకున్నారని దుష్ప్రచారం మొదలవుతుంది.

3. తెలంగాణ ప్రభుత్వం కొన్ని సినిమాలను ఎంపిక చేసి గద్దర్ అవార్డులు ఇస్తోంది. ఏపీ ప్రభుత్వం కూడా వాటికే ఇచ్చినా లేదా వేరే సినిమాలకు నంది అవార్డులు ఇచ్చినా రాజకీయాలు మొదలవుతాయి.

4. గద్దర్ అవార్డుల విషయంలో బిజేపి, బీఆర్ఎస్‌ పార్టీలు జోక్యం చేసుకోవడం లేదు. కానీ ఏపీ ప్రభుత్వం నంది అవార్డులు ఇస్తే వైసీపీ కోడిగుడ్డుకి ఈకలు పీకడం ఖాయం.

5. అవసరం పడినప్పుడు లేదా ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకున్నప్పుడు తప్ప తెలుగు సినీ ప్రముఖులకు ఏపీ ప్రభుత్వం గుర్తు రాదు. వారు ఇలా వ్యవహరిస్తున్నందుకే గతంలో జగన్‌ సిఎంగా ఉన్నప్పుడు టైట్ చేశారు. కానీ సిఎం చంద్రబాబు, డెప్యూటీ సిఎం పవన్‌కి అలాంటి పట్టింపులు లేవు. అందుకే సినీ పరిశ్రమ ఏపీకి రాకపోయినా వాటితో ఉదారంగానే వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చు. కనుక నంది అవార్డులు ఇవ్వనందుకు వారు కూడా నొచ్చుకోరాదు.

6. ఇలాంటి సమస్యలు అధిగమించడానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కలిసి అవార్డులు ప్రధానం చేయవచ్చు. కానీ తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమాలకు గద్దర్ అవార్డులు ఇవ్వడాన్నే కొందరు తెలంగాణవాదులు తప్పు పడుతున్నప్పుడు రెండు ప్రభుత్వాలు కలిసి ఇస్తే ఊరుకుంటారా?

7. కనుక బోడి గుండంతా సుఖం… ఊరుకున్నంత ఉత్తమం లేదని ఏపీ ప్రభుత్వం అలాంటి ఆలోచనలు చేయడం లేదేమో?

ADVERTISEMENT
Latest Stories