హనుమాన్ చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. 2024 సంక్రాంతి బరిలో థియేటర్లలోకి వచ్చిన హనుమాన్ పాన్ ఇండియా వ్యాప్తంగా గట్టి సౌండ్ చేసింది.
ఆ ఏడాది సంక్రాంతి బరిలో మహేష్ గుంటూరు కారం ఉన్నప్పటికీ ప్రేక్షకుడిని తన చిత్రం వైపుకి రప్పించుకున్నారు ప్రశాంత్. చిన్న బడ్జెట్, చిన్న హీరో, కొత్త దర్శకుడు అంటూ హనుమాన్ సినిమా పై కొంతమంది చిన్న చూపు చూపినప్పటికీ ప్రశాంత్ వర్మ తన న్యూ టాలెంట్ తో అటువంటి వారి చేత కూడా ప్రశంసలు దక్కించుకున్నారు.
అటువంటి దర్శకుడు హనుమాన్ రిలీజ్ అయ్యి దాదాపు ఏడాదిన్నర్ర గడుస్తున్నా ఇంతవరకు తన తదుపరి ప్రాజెక్ట్ పై ఎటువంటి అప్ డేట్స్ ఇవ్వలేదు. హనుమాన్ మూవీ తో వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ ను ఒడిసిపట్టుకోవడంలో ప్రశాంత్ తడబడ్డారా.? ఇందులో ఆయన అనుభవారాహిత్యం ఉందా.?
వన్ ఆఫ్ ది బాలీవుడ్ స్టార్ హీరో తో ప్రశాంత్ నెక్స్ట్ మూవీ అంటూ ప్రకటన వచ్చినప్పటికీ అది పట్టాలెక్కలేదు. ఇక ఆ తరువాత ప్రభాస్ తో మూవీ అని, నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ అరంగేట్రం కు ప్రశాంత్ దర్శకుడు అంటూ ప్రకటన వచ్చింది.
అయితే అవన్నీ కూడా కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యాయి, కానీ పట్టాలెక్కలేదు. హనుమన్ హిట్ తో తేజ సజ్జ ఈ సంక్రాంతికి మిరాయి అంటూ వచ్చి మరో హిట్ అందుకున్నారు, కానీ ప్రశాంత్ మాత్రం చడీచప్పుడు లేకుండా సైలెంట్ అయ్యారు.
తనదగ్గర సూపర్ హీరోస్ కు సంబందించిన ఒక యూనివర్స్ స్టోరీ నే ఉంది అంటూ చెప్పిన ప్రశాంత్ తన తదుపరి చిత్రానికి ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు అనే ప్రశ్న ఇండస్ట్రీలో గట్టిగానే వినిపిస్తుంది. హనుమాన్ కి సీక్వెల్ గా రాబోతున్న జై హనుమాన్ లో కాంతారా హీరో రుషబ్ శెట్టి నటిస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధిన పోస్టర్ ఒకటే విడుదలయ్యింది కానీ ఈ మూవీ పై మరో అప్ డేట్ అంటూ ఏమి బయటకు రాలేదు. రిషబ్ కాంతారా చాప్టర్ – 1 విశేషమైన స్పందన రావడంతో ఆయన తదుపరి చిత్రం పై కూడా బారి అంచనాలు నెలకొంటాయి.
అలాగే హనుమాన్ – జై హనుమాన్ కి చాల గ్యాప్ తీసుకుని, కొన్ని ప్రాజెక్టులను చేజార్చుకుని ఉన్న ప్రశాంత్ కు కూడా ఈ మూవీ విజయం అత్యంత కీలకం కాబోతుంది. అయితే కొత్త దర్శకులు సినిమా సినిమాకి ఇంత ఇంత గ్యాప్ తీసుకుంటే అది ఆయన కెరీర్ కు అంత శ్రేయస్కరం కాకపోవచ్చు అనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది.




