ఇంతకు మహేష్ కత్తి అమ్మ గారి కథ ఏంటి?

why kathi mahesh did not talk aboute her motherగత కొద్దికాలంగా బిగ్ బాస్ తో పాపులరైన కత్తి మహేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఆయనకు కొత్త ఎఫైర్ ఒకటి అంటగడుతున్నారు కూడా. దీని మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఆయనను ఎదురుకునే ప్రయత్నంలో కొందరు ఫ్యాన్స్ ఆవేశపడి మీడియా ముందు దొరికిపోయారు.

అయితే నిన్న నాగ చైతన్య బెజవాడ డైరెక్టర్ వివేక్ కృష్ణ మొత్తానికి కత్తి స్పీడ్ కు బ్రేక్ వేశారు. మీ అమ్మగారి గురించి చెప్పండి అంటూ గుచ్చి గుచ్చి అడిగి మహేష్ ను స్టూడియో నుండి లెగిసివెళ్లిపోయేలా చేసారు. దీనితో కత్తి మహేష్ అమ్మ వైపు ఏదో లొసుగు ఉన్నట్టు మెసేజ్ వెళ్ళింది దీనితో మెగా ఫాన్స్ రెచ్చిపోయి ఆ పాయింట్ మీద మహేష్ ను సోషల్ మీడియాలో దాడి చేసారు.

ADVERTISEMENT

అయితే తెలిసింది ఏమనగా మహేష్ కత్తి అమ్మగారు కొన్ని సంవత్సరాల క్రితం క్యాన్సర్ కారణంగా కాలం చేశారట. దీనితో ఆమె ప్రస్తావన రాగానే కత్తి ఇబ్బంది పడ్డారట. అయితే దీనిలో ఇబ్బంది పడటానికి ఏముంది అదే విషయం ఆయన చెప్పి ఉండాల్సింది అని మెగా ఫాన్స్ అంటున్నారు. ఇబ్బంది పడటానికి కచ్చితంగా వేరే కారణం ఏదో ఉంది అని వారు వాదిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories