టాలీవుడ్ ‘స్టార్ డం’ బరువెక్కువా.?

తెలుగు వారికి సినిమా అనేది కేవలం ఒక వినోదం మాత్రమే అనిచెప్పలేము, సినిమా అంటే వారికి అదొక ఎమోషన్, ఈ ఎమోషన్ కి భాషాపరమైన హద్దులు కూడా ఉండవు.

అలాగే తెలుగు సినీ అభిమాని వారి వారి అభిమాన హీరోను దైవంతో సమానంగా భావిస్తారు. తన అభిమాన హీరో వచ్చి రక్త దానం చెయ్యండి అంటూ ఒక్క పిలుపునిస్తే ఏ ఆలోచన లేకుండా వెంటనే క్యూ లో నిల్చుంటారు.

ADVERTISEMENT

అలాగే తమ అభిమాన నటుడి సినిమా రిలీజ్ అవుతుంది అంటే వారి రక్తం చిందించి మరి వారి కటౌట్ కి రక్త తిలకం దిద్దుతారు, కొన్ని కొన్ని దురదృష్ట పరిస్థితులలో రక్త సంబంధాలను కూడా పోగొట్టుకుంటారు. ఇంతలా తమ అభిమాన నటుడిని ఆరాధిస్తున్న టాలీవుడ్ ప్రేక్షకుడు ఒక్క విషయంలో మాత్రం ఎప్పుడు నిరాశనే ఎదుర్కుంటున్నారు.

ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ వరకు తన పరిధిని విస్తరించుకుంటూ పాన్ ఇండియా మూవీ గా రూపం మార్చుకుంది. అయితే తెలుగు సినిమా పాన్ ఇండియా చిత్రంగా మారినా తెలుగు హీరో స్టార్ డం బరువును బాలన్స్ చెయ్యడంలో మాత్రం ఎప్పుడు ఇతర భాష దర్శకులు తడబడుతూనే ఉంటున్నారు, టాలీవుడ్ అభిమానిని నిరాశ పరుస్తూనే వస్తున్నారు.

అందుకు టాలీవుడ్ స్టార్ హీరోస్ చిరు నుంచి మొదలు పెడితే ప్రభాస్, మహేష్, పవన్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా అనేకమంది స్టార్ హీరోస్ కి ఇతర భాష దర్శకులు అందించిన డిజాస్టర్స్ వారి అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి.

స్టాలిన్ తో తమిళ స్టార్ దర్శకుడు మురుగదాస్ టాలీవుడ్ మెగా ‘స్టార్’ చిరు ఖాతాలో ప్లాప్ సినిమాను అందించారు. ఇక అదే మురుగుదాస్ దర్శకత్వంలో స్పైడర్, ఎస్జే సూర్య, నాని సినిమాలతో సూపర్ ‘స్టార్’ మహేష్ తన సినీ కెరీర్ లో రెండు డిజాస్టర్లను చవి చూసాడు.

ఇక బంగారంతో ధరణి, పంజా తో విష్ణు వర్ధన్, పులి తో ఎస్ జే సూర్య పవర్ ‘స్టార్’ పవన్ కళ్యాణ్ వీరాభిమనుల సహనాన్ని పరీక్షించారు. ఇక తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ సైతం RRR తో మంచి జోష్ లో ఉన్న గ్లోబల్ ‘స్టార్’ రామ్ చరణ్ కెరీర్ కు గేమ్ ఛేంజర్ తో ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ ను వేశారు.

ఇక దేవర హిట్ తో ఉపుమీదున్న మాన్ ఆఫ్ మాసెస్ తారక్ కు మల్టీ స్టారర్ మూవీ వార్ -2 అంటూ ఊహించని షాక్ ఇచ్చారు బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ. అలాగే టాలీవుడ్ నుంచి మొదటి పాన్ ఇండియా ‘స్టార్’ అయినా బాహుబలి ప్రభాస్ సైతం ఈ ఇతర భాష దర్శకులను నమ్ముకుని ఆదిపురుష్ అంటూ బలయ్యారు.

ఇలా టాలీవుడ్ లో ఈ స్టార్ హీరోలకున్న స్టార్ డం బరువును ఇతర భాష దర్శకులు సరిగా అందిపుచ్చు కోలేక పోతున్నారా.? లేక అంచనా వేయలేకపోతున్నారా.? టాలీవుడ్ ప్రేక్షుకుడిని మెప్పించేలా టాలీవుడ్ స్టార్ హీరో తో ఒక మంచి హిట్ మూవీ తెరకెక్కించలేకపోతున్నారా.? ఇక్కడ లోపం దర్శకుడి ఆలోచన ఉంటుందా.? లేక తెలుగు సినీ అభిమాని ఎస్టిమేషన్ లో ఉంటుందా.?

అయితే టాలీవుడ్ దర్శకులు మాత్రం ఇతర భాష నటులను సైతం దర్శత్వం వహించి వారి కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ గా ఆయా చిత్రాలను రూపొందిస్తున్నారు. ఇందుకు తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన తమిళ హీరో ధనుష్ కుబేర, సార్ మూవీ తో వెంకీ అట్లూరి ధనుష్ కు మంచి విజయాలను కట్టబెట్టారు.

ఇక సీత రామం తో హను రాఘవపూడి, లక్కీ భాస్కర్ తో వెంకీ అట్లూరి దుల్కర్ కెరీర్ బెస్ట్ మూవీస్ అందించారు.మరి టాలీవుడ్ ఐకాన్ ‘స్టార్’ ని డైరెక్ట్ చేయబోతున్న అట్లీ, తారక్ ను దర్శకత్వం వహిస్తున్న ప్రశాంత్ నీల్ ఈ ఆనవాయితీని తప్పించి టాలీవుడ్ స్టార్ హీరో ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ అందించగలరా.?

ADVERTISEMENT
Latest Stories