నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలన్న మంచు లక్ష్మి ప్రయత్నంలో భాగంగా తాజాగా “W/o రామ్” ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విజయ్ ఏలకంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. టీజర్ కట్ చేసిన షాట్స్ లో టేకింగ్ బాగున్నాయి, అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా టీజర్ కు తగ్గట్లు ఉంది.
కానీ ప్రధాన పాత్రలో నటించిన మంచు లక్ష్మీ ఈ పాత్రకు ఎంతవరకు న్యాయం చేసిందనేది అసలు ప్రశ్న. టీజర్ లో కట్ చేసిన నాలుగైదు షాట్స్ వరకు ఓకేలా కనపడుతున్నప్పటికీ, రెండు గంటల నిడివిలో మంచు వారమ్మాయి నిరూపించుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే… ఇప్పటివరకు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ఒక్క సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించలేదు.
ADVERTISEMENT
ADVERTISEMENT



