కేటీఆర్ రేవంత్ ను కట్టడి చెయ్యగలరా.?

బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డిని కట్టడి చెయ్యలేకపోయిందనే చెప్పాలి. రేవంత్ టీడీపీ పార్టీలో ఉన్నప్పటి నుంచి ఓటుకి నోటు కేసులో కేసీఆర్ కు టార్గెట్ గా మారారు. అయితే రేవంత్ కు చంద్రబాబు తో ఉన్న సాన్నిహిత్య సంబంధం కూడా బిఆర్ఎస్ పార్టీకి రేవంత్ మీద ఫోకస్ ను పెంచేలా చేసింది.

అయితే ఆ కేసులో బిఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ మీద కాస్త పై చేయి సాధించినప్పటికీ అదే రేవంత్ కు కేసీఆర్ ఓటమి కోసం పంతం పట్టేలా చేసింది. దాని కోసం రేవంత్ తన
పార్టీ జెండాను మారుస్తూ టీడీపీ నుండి కాంగ్రెస్ కు జంప్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఎందరో సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ బిఆర్ఎస్ కు బిగ్ టార్గెటెడ్ పర్సన్ మాత్రం రేవంతే అని చెప్పాలి.

ADVERTISEMENT

పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ కు పోటీగా నిలిచిన రేవంత్ కేసీఆర్ ను గద్దె దింపడమే తన అంతిమ లక్ష్యంగా చేసుకుని అందుకు తగ్గట్టే తన ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకెళ్లారు. అలాగే కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి రాజకీయ జీవితానికి ముగింపు పలకడానికి తన దగ్గరున్న అస్త్రాలన్నిటి వాడేశారు.

అయితే ఈ హోరా హోరి పోరులో ఒకసారి రేవంత్ ను ఎన్నికల బరిలో ఓడించి కేటీఆర్ పై చేయి సాధిస్తే మరో సారి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి రేవంత్ తన పంతం నెరవేర్చుకున్నారు. అయితే బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే రేవంత్ తగ్గేదెలా అన్నట్టుగా బిఆర్ఎస్ నాయకుల మరి మీద ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ మీద విరుచుకుపడేవారు.

అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటూ రేవంత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అలాగే బిఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, కేసీఆర్ అజ్ఞాతంలో ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ చేస్తున్న రాజకీయ విమర్శలకు రేవంత్ వెనక్కి తగ్గుతారా అంటే తగ్గారనే సమాధానమే వినపడుతుంది.

ఇటు హైడ్రా బాధితులతో కేటీఆర్ రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ విమర్శలు సంధిస్తున్నారు. అలాగే మూసి ప్రక్షాళన మీద కూడా తెలంగాణ రాజకీయం వేడెక్కుతుంది. అధికార ప్రతిపక్ష నాయకులు నువ్వా నేనా అన్నట్టుగా సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. ఈ పోరులో వెనక్కి తగ్గేదెవరు, ముందడుగు వేసేదెవరు అంటూ రేవంత్, కేటీఆర్ వాగ్వాదాలను సాధారణ ప్రజానీకం కూడా నిశితంగా గమనిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories