కన్నడ సూపర్‌స్టార్ యష్ నటించిన Toxic అన్ని చోట్లా డిజాస్టర్‌గా నిలిచింది. రిలీజ్ తర్వాత సినిమా టీమ్ నుంచి ఎలాంటి సౌండ్ లేదు. ప్రమోషనల్ షోల కోసం కూడా ఎవరూ బయటకు రాలేదు. ఈ ఫలితం వాళ్లను ఎంతగా ప్రభావితం చేసిందో దీన్ని బట్టే అర్థమవుతోంది.
సోషల్ మీడియా మొత్తం Toxic ట్రోల్స్, మీమ్స్‌తో నిండిపోయింది. సినిమాలోని కొన్ని సీన్లు వైరల్‌గా మారి యష్‌ను మరింత ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టాయి. సినిమాలు ఫ్లాప్ అవడం సహజమే. కానీ కొన్ని ఫ్లాపులు మేకర్స్‌కు చాలా కాలం గుర్తుండిపోయే ఇబ్బందిని మిగులుస్తాయి. Toxic టీమ్ విషయంలో అదే జరిగింది.
ఈ సమయంలో యష్‌కు మద్దతుగా కిచ్చా సుదీప్, రిషబ్ శెట్టి ముందుకొచ్చారు. Toxic పై దాడి చేస్తున్న వారిని పరోక్షంగా విమర్శిస్తూ, ఇలాంటి బోల్డ్ ప్రయత్నం చేసిన యష్‌ను అభినందించారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి యష్‌కు సాలిడారిటీ చూపించే ప్రయత్నం చేశారు.
కానీ ఈ సానుభూతి యష్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుంది?
Toxic పై విమర్శలు చేస్తున్నది వెబ్ మీడియానో, మరో మీడియానో కాదు. సినిమా చూసిన ప్రేక్షకులే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఇండస్ట్రీ నుంచి వచ్చే మద్దతు ఈ పరిస్థితిని మార్చగలదా?
సుదీప్, రిషబ్ శెట్టి మాటలు యష్‌కు వ్యక్తిగతంగా కొంత ధైర్యం ఇవ్వొచ్చు. కానీ Toxic వల్ల జరిగిన డ్యామేజ్‌ను మాత్రం సరిచేయలేవు. ఈ సినిమా మిగిల్చిన ఇబ్బంది సానుభూతితో తగ్గే స్థాయిని దాటిపోయింది.





