ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యంగా బీజేపీ టార్గెట్ గా కాక్రోచ్లు చేస్తున్న రాజకీయానికి ఏపీలో ఎంట్రీ లభిస్తుందా.? సీజేపీ నేతలు కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల టార్గెట్ గానే ముందుకెళుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కూటమిలో భాగమైన ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలో ఉంది.
ఈ నేపథ్యంలో కాక్రోచ్లు ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తారా.? అన్న చర్చ మొదలయ్యింది. అయితే రాష్ట్రంలో ఆ చర్చకు ఊతమిచ్చింది వైసీపీ అధినేత వైఎస్ జగనే. తాజాగా సర్ కు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ చేపుట్టిన ఉద్యమాలు, అందుకు ప్రభుత్వం చేసిన అరెస్టులు బీజేపీ వ్యతిరేక శక్తులకు, కాంగ్రెస్ మిత్రపక్షాలకు ఒక రాజకీయ అవకాశంగా మారాయి.
అయితే ఆ వ్యతిరేక శక్తులలోకి, మిత్రపక్షాల జాబితాలోకి వెళ్లే విధంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీజేపీ నేతల అరెస్టులను ఖండిస్తూ వారికి మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. అయితే జగన్ తమకు మద్దతుగా చేసిన పోస్ట్ కు సీజేపీ ఫౌండర్ అభిజిత్ దూప్కే కూడా జగన్ కు కృతజ్ఞతలు తెలియచేస్తూ రిప్లై ఇచ్చారు.
దీనితో వైసీపీ చొరవతో, జగన్ ప్రోత్సాహంతో కాక్రోచ్ జనతా పార్టీ ఏపీలో కూడా అడుగుపెట్టే అవకాశం ఉందా అంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. సీజేపీ కి మద్దతు పలికే నటుడు ప్రకాష్ రాజ్ సైతం బాబు, పవన్ టార్గెట్ గా సోషల్ మీడియా జస్ట్ ఆస్కిన్గ్ అంటూ సెక్యులరిజం ముసుగులో రెచ్చకొడతారు.
తాజాగా తానూ త్వరలో ఏపీ రాజకీయాల మీద కూడా స్పందిస్తానని, ఏపీ రాజకీయాలలో భాగమవుతానంటూ ప్రకాష్ ప్రకటించడం, సీజేపీ కి మద్దతుగా జగన్ ముందుకు రావడం, ఇన్నాళ్ళు చలనం లేకుండా ఉండిపోయిన జగన్ అక్రమాస్తుల కేసు, వివేకా హత్య కేసు విచారణల పేరుతో ఒక్కసారిగా వెలుగులోకి రావడం యదృక్కమో లేదా రాజకీయ వ్యూహమో మరికొన్ని రోజులలో బయటకొచ్చే అవకాశం ఉంది.





