ప్రపంచ రికార్డు నెలకొల్పిన పాకిస్తాన్ క్రికెటర్!

younis-khan-breaks-rahul-dravid-world-test-cricket-recordబ్యాటింగ్ విభాగంలో ఉన్న రికార్డులన్నీ సచిన్ టెండూల్కర్ సొంతం అన్న విషయం క్రికెట్ ప్రియులకు తెలిసిందే. అయితే సచిన్ కూడా సాధించలేని కొన్ని అరుదైన రికార్డులను ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ సొంతం చేసుకున్నాడు. అలాంటి రికార్డులలో ఒక రికార్డును పాక్ క్రికెటర్ యూనిస్ ఖాన్ సాధించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన యూనిస్ 136 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

అయితే ఈ సెంచరీతో ఓ సరికొత్త రికార్డుకు తెరలేపాడు యూనిస్ ఖాన్. పదకొండు దేశాల్లో సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్ మెన్ గా యూనిస్ ఖాన్ అవతరించి, సరికొత్త చరిత్రను లిఖించాడు. టెస్టు హోదా ఉన్న పది దేశాలతో పాటు టెస్ట్ హోదా లేని యూఏఈలో కూడా యూనిస్ సెంచరీ ఉండడంతో ఈ రికార్డు వశమైంది. చేశాడు. అంతకు ముందు టెస్టు హోదా కలిగిన 10 దేశాల్లో ఒక్క రాహుల్ ద్రావిడ్ మాత్రమే సెంచరీలు సాధించగా, తాజాగా ఆస్ట్రేలియాలో సెంచరీ సాధించడం ద్వారా ఈ రికార్డును యూనిస్ ఖాన్ బద్దలుకొట్టిన వాడయ్యారు.

ADVERTISEMENT

అయితే యూనిస్ సెంచరీ చేసినా పాకిస్తాన్ పతనం మాత్రం ఎవ్వరూ ఆపలేకపోయారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 538 పరుగుల వద్ద ఆస్ట్రేలియా డిక్లేర్ చేయగా… పాకిస్థాన్ 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసి ఇంకా 267 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో యూనిస్ ఉన్నప్పటికీ, చేతిలో ఇంకా రెండు వికెట్లు మాత్రమే మిగిలి ఉండడంతో, ఓటమి భారం తప్పకపోవచ్చని క్రీడా పండితులు వెలిబుచ్చుతున్న అభిప్రాయం.

ADVERTISEMENT
Latest Stories