అసెంబ్లీ : ఎమ్మెల్యేలపై విచారణ ఎందుకు జరగడం లేదు?

ys-jagan-inexperience-in-assembly‘కాల్ మనీ’ స్కాం రాష్ట్రాన్నే కాదు, ఏపీ అసెంబ్లీని కూడా ఓ ఊపు ఊపింది. నిందితులతో కలిసి తెలుగుదేశం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అడ్డంగా దొరికినా, ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవడం లేదని, పోలీసులు ఎందుకు వారిపై విచారణ జరపడం లేదని వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా అందరి ప్రమేయం ఉందని, దీనికి సాక్ష్యాలుగా చంద్రబాబు, ఇంటెలిజెన్స్ డీజీతో నిందితుడు వున్న ఫోటోలను చూపించారు. అయితే జగన్ కు దీటుగా జవాబిచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు.

రాష్ట్రంలో ‘కాల్ మనీ’కి సంబంధించి కేవలం ఒక్క మహిళ మాత్రమే ఫిర్యాదు చేసిందని, ఆ తర్వాత దీనిని సీరియస్ గా పరిగణించిన ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, దానికి అనుగుణంగానే కేసులు పెట్టామని అన్నారు. జగన్ ఆరోపిస్తున్నట్లుగా ఏ ఒక్క ఎమ్మెల్యేపై గానీ, ఎమ్మెల్సీపై గానీ, మంత్రిపై గానీ ఎవరూ ఫిర్యాదు చేయలేదని… అలా ఫిర్యాదులు రాకుండా కేవలం ఆరోపణలతో అరెస్టులు సాధ్యం కాదని, బహుశా జగన్ కు చట్టం గురించి తెలియక పోవచ్చని అన్నారు. ఒకవేళ సాక్ష్యాలను చూపుతూ జగన్ ఫిర్యాదు చేసినా, విచారణ జరిపిస్తామని, ఏమైనా సాక్ష్యాలు ఉంటే జగన్ ముందు పెట్టాలని” అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు.

ADVERTISEMENT

మంత్రి గారు ఇచ్చిన సమాధానంతో ఏకీభవించని జగన్, అదే పనిగా మళ్ళీ ఫోటోలను చూపిస్తూ ప్రసంగించే ప్రయత్నం చేసారు. అయితే ఒకటే వ్యాఖ్యలను పదే పదే చెప్తున్న జగన్ వైఖరితో విసిగిపోయిన స్పీకర్… ప్రసంగాన్ని ముగించాల్సిందిగా కోరారు. దీంతో స్పీకర్ పై కూడా ఫైర్ అవుతూ… ఎందుకు ముగించాలని వాగ్వివాదం చేస్తూ… ‘మ్యాటర్’ లేక చింతమనేని ప్రభాకర్ ఉదంతం, ఈ రోజు అంగన్ వాడీ సంఘటనలను ప్రస్తావించి… ‘’కాల్ మనీ’ అంశాన్ని పక్కనపెట్టి తదుపరి ప్రసంగాన్ని రెండు నిముషాల్లోనే ముగించారు. జగన్ ప్రశ్న – అచ్చెన్నాయుడు జవాబుతో “ఎమ్మెల్యేలపై విచారణ ఎందుకు జరగడం లేదన్న సందేహానికి” రాష్ట్ర ప్రజలకు కూడా ఓ క్లారిటీ వచ్చినట్లయ్యింది.

ADVERTISEMENT
Latest Stories