వైసీపి స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్: అర్ధం చేసుకోరూ….

jagan-ap-skill-development

జగన్, వైసీపి అంటే గిట్టనివాళ్ళు రాష్ట్రానికి పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు రప్పించలేదు…. ఉద్యోగాలు కల్పించలేదు. డీఎస్సీ ప్రకటించలేదంటూ కాకుల్లా కావుకావుమంటూనే ఉన్నారు.

కానీ జగన్‌ ప్రభుత్వం సుమారు లక్షన్నర మందికి వాలంటీర్ ఉద్యోగాలు కల్పించిందని, ప్రతీ నాలుగు వీధులకి ఓ సచివాలయం ఏర్పాటు చేసి వాటిలో మరో లక్ష మంది వరకు ఉద్యోగాలు కల్పించిందనే విషయం తెలియన్నట్లు మాట్లాడుతుంటారు.

ADVERTISEMENT

వైజాగ్‌లోనే పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తే దానిలో పాల్గొన్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ‘జగన్‌ ఇమేజ్’ చూసి ఏకంగా రూ.13.56 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేస్తామంటూ వెంటపడ్డారనే విషయం ఎవరికీ గుర్తులేదు.

వాటితో ఆరు లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయన్న గుడ్డు మంత్రి మాటలను కూడా ఎవరూ నమ్మడం లేదు. ఏం చేస్తాం… ఇది కలియుగం ‘మేలు చేసేవాడికే’ అపనిందలు తప్పవని సరిపెట్టుకోక తప్పదు.

వైసీపి నవరత్నాలు+లో యువతకు స్కిల్ డెవలప్‌మెంట్‌, దాని కోసం నెలకు రూ.2,500 నుండి రూ.3,000 స్టైఫండ్ ఇస్తామనే హామీ కూడా ఉంది.

అసలు ఆంధ్రాలో పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు వస్తే కదా… స్కిల్ డెవలప్‌మెంట్‌ అవసరం? రానప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్‌ దేనికి?అని గిట్టనివాళ్ళు కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ ‘వైసీపి స్కిల్ డెవలప్‌మెంట్‌’ అంటే ఏమిటో వారెవరికీ అర్ధం కాదు. కనుక వివరించక తప్పదు.

వైసీపి మళ్ళీ వస్తే తప్పకుండా వాలంటీర్, సచివాలయ ఉద్యోగాలు ఉంటాయి. వాటన్నిటికీ ‘వైసీపి శిక్షణ’ అవసరమే కదా? అది స్కిల్ డెవలప్‌మెంట్‌ కాదా?

బటన్ నొక్కుడు సభలకు జనాలను ఊరికే రమ్మంటే రావడం లేదు. కనుక ఏదో ఓ పేరుతో లబ్ధి (మేలు) పొందుతున్న వారందరినీ వాలంటీర్లు తీసుకువచ్చి వారి చేతుల్లో ‘థాంక్యూ సిఎం సార్’ అని ప్లకార్డులు పెట్టి కూర్చోబెడుతుంటారు. దీనికి ఎంత స్కిల్, సహనం అవసరమో వాలంటీర్లకే తెలుసు.

అలా వచ్చినవారందరికీ జగన్మోహన్‌ రెడ్డి ‘వైసీపి ఉగ్గుపాలు పట్టించి’ వైసీపి భాష, మాట, ఆలోచన, నడవడిక, భక్తి అన్నీ నేర్పిస్తారు కూడా. స్కిల్ డెవలప్‌మెంట్‌ అంటే ఇదేకదా? కానీ అర్దం చేసుకోకుండా పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు వాటిలో ఉద్యోగాలకే స్కిల్ డెవలప్‌మెంట్‌ అని ఏదేదో ఊహించేసుకుంటారు. అది వైసీపి తప్పా?

ADVERTISEMENT
Latest Stories