సీఎం జగన్ కు ఇంతకంటే అవమానం ఉంటుందా?

YS Jagan damage control over temple controversyఎన్నికల ముందు తన బాబాయి వివేకానంద రెడ్డి మృతి మీద తమకు అనేక అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వం మీద నమ్మకం లేదని, ఈ కేసుని సిబిఐకిఅప్పగించాల్సిందిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరుగుతుండగానే ఎన్నికలు జరగడం, జగన్ ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి.

అప్పుడు సిబిఐ విచారణ కావాలన్నా జగన్, ఇప్పుడు వద్దు అంటున్నారు. వివేక కుమార్తె సునీత తమకు వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన సన్నిహితుల మీద, కుటుంబసభ్యుల మీద అనుమానం ఉంది అంటూ హైకోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయినా జగన్ సిబిఐ విచారణ వద్దనే అంటున్నారు.

ADVERTISEMENT

సీబీఐ విచారణ తెచ్చుకున్నా ఆ కేసులో ఏమవుతుందో తెలియని పరిస్థితి. జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఆ కేసు అతీగతి లేదు. దానితో సీఎం మీదే ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా… అన్న పాలనలో న్యాయం జరగదు అనుకున్నారో ఏమో గానీ వివేకా కుమార్తె సునీత న్యాయం కోసం హక్కుల కార్యకర్తలను కలిశారు.

దాదాపుగా పాతికేళ్ల న్యాయపోరాటం చేసి కేరళలో సిస్టర్ అభయ పై రేప్, హత్య కేసులో నిందితులకు శిక్షపడేలా చేసిన కేరళకు చెందిన జోమున్ అనే హక్కుల కార్యకర్త సహకారం ఆమె కోరారట. త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి… వైఎస్ వివేకా హత్య అంశంపై స్పందిస్తానని జోమున్ ఆమెకు హామీ ఇచ్చారు. సొంత అన్న ప్రభుత్వం న్యాయం జరగకపోవడంతో హక్కుల కార్యకర్త సాయం అర్ధించడం అంటే జగన్ కు అంతకంటే అవమానం ఉంటుందా? అని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories