హిందువుల విశ్వాసాల మీద వైకాపాకు చిత్తశుద్ధి ఉందంటే నమ్మే పరిస్థితి ఉందా?

YS Jagan - Hinduఅంతర్వేదిలో రథానికి నిప్పంటించిన ఘటన సంచలనం సృష్టిస్తుంది. దీనిని అదనుగా తీసుకుని బీజేపీ తన అనుబంధ సంఘాలను రంగంలోకి దించింది. స్థానికంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయిస్తుంది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బీజేపీని ఏమీ అనలేక ఎప్పటిలానే టీడీపీని, చంద్రబాబుని టార్గెట్ చెయ్యడం గమనార్హం.

“తునిలో రైలు, అమరావతిలో తోటలు తగలబెట్టించి, విజయవాడలో గుడులు కూల్చి, అమరేశ్వరుడి భూములు మింగి, పుష్కరాల్లో 7వేల కోట్లు ఆరగించి, దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించి, అంతర్వేదిలో రథానికి నిప్పు పెట్టించాడు. పాప భీతి, దైవ భక్తి ఏనాడూ లేనివాడు. ఆ బాబే హిందుత్వంపై దాడులకు మూలకారకుడు,” అంటూ ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ఆరోపించారు.

ADVERTISEMENT

ఈ సంఘటన జరిగినప్పుడు కొందరు రథం మీద ఉన్న తేనెపట్టు కోసం ఇలా చేశారని పోలీసులతో చెప్పించింది ప్రభుత్వం. ఇప్పటివరకూ ఎక్కడా కుట్రకోణం అనేది చెప్పలేదు. అసలు వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా అనేక చోట్ల ఇటువంటి ఘటనలు జరిగితే వాటికి పిచ్చి వాళ్ళు చేసిన పని వంటి అసందర్భ, నమ్మశక్యం కాని అనేక కారణాలతో ప్రభుత్వం ఆ కేసులను తొక్కిపెట్టింది.

ఇప్పుడు తాజాగా రాజకీయంగా ఇబ్బంది కలగకుండా చంద్రబాబు మీద ఆరోపణలు చేస్తున్నారు. అందులో నిజానిజాలు పక్కన పెడితే ఆ అంశాల మీద వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా కనీసం విచారణ కూడా చేయించలేదు. దానిబట్టి హిందువులు విశ్వాసాల మీద ఆ పార్టీ చిత్తశుద్ధి కనిపిస్తుంది అంటూ సామాన్యులు ఆరోపిస్తున్నారు. సొంత పోలీసులు కూడా ఏకీభవించని ఆరోపణలు చేస్తే నమ్మే పరిస్థితి ఉండదని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఎప్పటికి తెలుసుకుంటారో?

ADVERTISEMENT
Latest Stories