ఉన్నఫళంగా జగన్ కేసీఆర్ ని ఎందుకు కలిశారు?

YS-Jagan---KCRఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం కుటుంబసమేతంగా జెరూసలేం వెళ్లనున్నారు. అయితే దానికంటే ముందు ఆయన హైదరాబాద్ వచ్చారు. తొలుత తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమై దాదాపుగా గంటన్నర పాటు వారి భేటీ కొనసాగింది. ఆ తరువాత ఆయన ప్రగతిభవన్‌కు వెళ్లి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ రెండు మీటింగులు ముఖ్యమంత్రి షెడ్యూల్ లో లేకపోయినా చివరి నిముషంలో జగన్ మార్పు చేశారు.

ADVERTISEMENT

కేసీఆర్‌తో భేటీ మర్యాదపూర్వకమేనని పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఇద్దరు సీఎంలు సమావేశం నేపథ్యంలో పలు కీలక అంశాలు చర్చించారని వార్తలు వస్తున్నాయి. బందరు పోర్టుని తెలంగాణకు ఇవ్వడం, గోదావరి జలాల్ని శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు తరలింపు ప్రాజెక్టు గురించి చర్చించబోతున్నారని రాజకీయవర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నాలుగు రోజుల పాటు జెరూసలేంలో పర్యటించిన . అనంతరం తిరిగి ఐదో తేదీ మధ్యాహ్నం అమరావతికి చేరుకోనున్నారు.

ఆ మరుసటి రోజు ఢిల్లీలో ప్రధాని మోదీతో జగన్ సమావేశం కానున్నారు. ప్రత్యేక హోదా, కడప స్టీల్‌ ప్లాంట్‌, రామాయప ట్నం ఓడరేవు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రెవెన్యూ లోటు భర్తీ సహా విభజన చట్టంలోని హామీల అమలుకు సహకరించాలని కోరుతూ జగన్ ఓ వినతి పత్రం సమర్పించనున్నారు. సెర్బియాలో వాన్ పిక్ కేసులో అరెస్టయిన నిమ్మగడ్డ ప్రసాద్ గురించి కూడా ప్రధాని వద్ద జగన్ ప్రస్తావించే అవకాశం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

ADVERTISEMENT
Latest Stories