ప్రతిపక్షంలో ఉండగా ఎంతో శ్రమించి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన జగన్… ఆ తరువాత రెండేళ్ల పాటు తన రాజాప్రస్థానంలోనే ఉండిపోయారు అయితే రాజ ప్రాసాదాలలోనే ఉండిపోతూ…. తమ వెంట మొత్తం జనం ఉన్నారని, మిగిలిన వాటితో సంబంధం ఏంటి అని అని ఆలోచించే నేతలు చరిత్రలో ఎందరో! అందుకు ఉదాహరణ తమిళనాడులో జయలలిత.
జయలలిత మొదటి సారి 1991 ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యారు. ఆ సమయంలో ఆమె రాజకీయ దురంధరుడు కరుణానిధిని ఓడించి, తాను అధికారంలో ఉండగా ఆ పార్టీ వారిని ఎన్నో తిప్పలు పెట్టేవారు. అదే సమయంలో ప్రజలకు అనేక తాయిలాలు ఇస్తూ… ప్రజలకు, మీడియాకు దూరంగా ఉండేవారు. ఫలితంగా జనాలతో అతి పెద్ద అంతరం ఏర్పడి 1996 ఎన్నికలలో ఓడిపోయారు.
జగన్ రెండేళ్ళ ప్రస్థానం కూడా అదే దారిలో పయనిస్తోంది. నిత్యం ప్రజలకు డబ్బులు పడేస్తున్నాం కదా? అనుకుంటూ కరోనాతో పదివేల మంది చనిపోయినా, ఆక్సిజన్ లేక ఆసుపత్రిలో రోగులు చనిపోయినా ముఖ్యమంత్రి స్థాయి నుండి కిందవరకూ ఎవరూ జవాబుదారీగా ఉండరు. ప్రశ్నించే ప్రతిపక్షానికి నోరు విప్పి జవాబు చెప్పరు. మీడియా ముందుకు అసలు రారు.
ఏదైనా వివాదం చెల్లరేగినప్పుడల్లా ఎవరో ఒకరిని అరెస్టు అంటూ ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సహజంగా ప్రజలు ఏవీ గమనించడం లేదు అనుకుంటే అమాయకత్వమే… అధికారంలో ఉన్నవారిని ప్రజలు హర్ట్ చెయ్యరు… వాళ్ళు ఇచ్చినవి తీసుకుంటారు… చిన్న చిన్న ఎన్నికలలో గెలిపిస్తారు. అయితే సాధారణ ఎన్నికలలో షాక్లు ఇస్తారు. గతంలో జయలలిత పరిస్థితి జగన్ కు రాకుండా జాగ్రత్త పడితే ఆయనకే మంచిది.



