ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ప్రహసనంగా మారాయి. హై కోర్టు ధర్మాసనం ఎన్నికలు జరపాలని తీర్పు ఇవ్వడంతో ఈ విషయంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు తలుపు తట్టింది. అయితే ఎలాగైనా ఎన్నికలు ఆపాలనే ప్రయత్నంలో కనీసం పిటిషన్ సరిగ్గా ఉందో లేదో కూడా చూడకుండా వెళ్లినట్టుగా ఉంది.
సుప్రీంకోర్టులో వైసీపీ ప్రభుత్వ పిటిషన్‍ను వెనక్కిచ్చిన రిజిస్ట్రి. పిటిషన్ తప్పుల తడికగా ఉందని… సరి చేసి మళ్ళీ వెయ్యాలని రిజిస్ట్రి తిప్పి ఇచ్చింది. పిటిషన్ సరిచేసి మళ్లీ వేయడానికి ఈ రోజు కుదరకపోవచ్చని ప్రభుత్వం తరపు లాయర్లు. మళ్లీ సోమవారమే బెంచ్ ముందుకొచ్చే ఛాన్స్ ఉంది.
అయితే రేపు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఇది ప్రభుత్వానికి ఇబ్బందికరమే. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కోడ్ అమలులోకి వచ్చేస్తుంది. ఒక ప్రభుత్వం తరపున వేసిన పిటిషన్ లో తప్పులు అంటే అది ప్రభుత్వానికి ఇబ్బందే.
ప్రస్తుత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్ళకూడదని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అనుకుంటుంది. ఈ తరుణంలో ఈరోజు పిటిషన్ సుప్రీం కోర్టులో హియరింగ్ కి తెచ్చుకోకపోవడం ఇబ్బందిగా పరిణమించింది. నిమ్మగడ్డ చంద్రబాబు మనిషని, ఆయన కమ్మ సామాజికవర్గానికి చెందిన వారని… టీడీపీకి అనుకూలంగా ఉంటారని జగన్ అభిప్రాయంగా ఉంది.





