ఏపీలో ఓదార్పుయాత్రలకి వైసీపి పేటెంట్ తీసుకొందా?

YS Jagan - Pawan Kalyan - Odarpu Yatraచెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొన్నట్లు ఆనాడు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణ సానుభూతిని సొమ్ము చేసుకొనేందుకు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రల పేరుతో పార్టీని నిర్మించుకొన్న సంగతి అందరికీ తెలిసిందే. బహుశః ఇప్పటి కంటే అప్పుడు తెలుగువారి గుండెలు చాలా నాజూకుగా ఉండేవేమో?బెలూన్ల మాదిరిగా టపీటపీల్మని పగిలిపోతుంటే, ఆ జాబితా పట్టుకొని జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వారి కుటుంబాలను ఓదార్చుతుండేవారు.

ఆవిదంగా తాము వైసీపిని నిర్మించుకొన్న విషయం మరిచిపోయి, ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకొంటున్న కౌలు రైతులను ఓదార్చడానికి వెళుతుంటే వైసీపీ నేతలు చాలా కోపంగా ఉన్నారు. ఇదెలా ఉందంటే, ‘మేము చేస్తే సంసారం…ఇతరులు చేస్తే వ్యభిచారం..’ అన్నట్లుంది. సినిమా డిస్ట్రిబ్యూటర్లు నైజాం, సీడెడ్ అంటూ ప్రాంతాల వారీగా హక్కులు కొనుకొంటుంటారు. అలా.. వైసీపి కూడా రాష్ట్రంలో ఓదార్పుయాత్రలకి శ్వాశ్విత హక్కులు కొనేసుకొందా?అనే సందేహం కలుగుతోంది.
అయినా తమ పార్టీకి తిరుగులేదని, తమ సంక్షేమ పధకాలే తమని మళ్ళీ గెలిపిస్తాయని, మరో 20 ఏళ్ళ వరకు జగనన్నే ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తారని వైసీపీ నేతలు నమ్మకంగా చెపుతున్నప్పుడు, అర్భకుడు, రాజకీయాలలో ఓనమాలు తెలియనివాడు.. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పాదయాత్రలు చేసుకొంటేనేమి…ఓదార్పు యాత్రలు చేసుకొంటేనేమి?ఆయన తెలుగుదేశంతో పార్టీతో పొత్తులు పెట్టుకొంటేనేమి?బిజెపితో అంటకాగితేనేమి?

ADVERTISEMENT

పవన్ కళ్యాణ్‌కి అంత సీన్ లేదని కనీసం దత్తపుత్రుడు అనే పదానికి అర్ధం కూడా తెలియకుండా మాట్లాడి పప్పులో కాలేశారని ‘వైసీపీ మనసాక్షి’లో కధనాలు వండివార్చేస్తున్నప్పుడు ఆయన గురించి వైసీపీ నేతలు ఎందుకు అంతగా ఆందోళన చెందుతున్నట్లు?అంటే వైసీపీ నేతలు ‘ఆల్ ఈజ్ వెల్…’ అంటూ పైకి కోరస్ పాడుతున్నప్పటికీ, వచ్చే ఎన్నికలలో గట్టెక్కడం అంత వీజీ కాదని, పవన్ కళ్యాణ్ వలన కూడా ఎన్నికలలో వైసీపీకి నష్టం జరుగుతుందని లోలోన ఆందోళన చెందుతున్నారని అర్దమవుతూనే ఉంది.

తెలంగాణలో అధికార టిఆర్ఎస్‌ గతంలో అసలు బిజెపిని పట్టించుకొనేదే కాదు. కానీ ఇప్పుడు రోజూ బిజెపి నామస్మరణ చేస్తోంది. తమ శత్రువు బలవంతుడని లేదా బలపడుతున్నాడని సిఎం కేసీఆర్‌ గుర్తించారన్న మాట! అదేవిదంగా ఏపీలో జనసేనాని కూడా ఓదార్పు యాత్రలతో బలపడితే తమ కొంప ముంచుతారని వైసీపీ కంగారుపడుతోందన్న మాట!

ADVERTISEMENT
Latest Stories