పాదయాత్ర తొలిరోజునే మరో అంతర్జాతీయ స్కామ్ లో జగన్

YS Jagan Praja Sankalpa Yatra Paradise Papersపనామా పత్రాలు మాదిరిగానే జర్మనీ వార్తాపత్రిక సుడేషీ జుటంగ్‌ ‘ప్యారడైజ్‌ పేపర్ల’ పేరుతో ప్రపంచంలోని ప్రముఖుల అక్రమ ఆర్థిక లావాదేవీలు బహిర్గతం చేసింది. పన్నుల బెడదలేని స్వర్గధామాలుగా పేరుపొందిన దేశాల్లో ప్రముఖులు పెట్టిన పెట్టుబడులు వెల్లడయ్యాయి. ఈ కీలక పత్రాల్లో మొత్తం 180 దేశాలకు సంబంధించిన వారి వివరాలు ఉన్నాయి.

సంఖ్యాపరంగా భారత దేశం 19వ స్థానంలో నిలుస్తుంది. మొత్తం 714 మంది భారతీయుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ పాత్రల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి పేరు కూడా ఉంది. సరిగ్గా జగన్ పాదయాత్ర మొదలు పెట్టే ఒక రోజు ముందు ఈ అంతర్జాతీయ స్కామ్ లో జగన్ పేరు రావడం ఆ పార్టీ ని ఇబ్బంది పెట్టే విషయమే.

ADVERTISEMENT

ఇప్పటికే అనేక కేసులలో ఇరుక్కుని సతమతం అవుతున్న జగన్ మోహన్ రెడ్డి ఈ విషయం ఇబ్బంది పెట్టేదే. మరోవైపు జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం ఇడుపులపాయ చేరుకున్న జగన్‌ తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పించారు.

అనంతరం సుమారు 9 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాత్రికి వేంపల్లి చేరుకుని అక్కడే బస చేస్తారు. అయితే ఆ పార్టీ లీడర్లు అంతా ఇప్పుడు ప్యారడైజ్ పేపర్స్ ను ఎదురుకునే పనిలో పడతారు. ఆ లోగా శుక్రవారం రానే వస్తుంది మళ్ళి జగన్ హైదరాబాద్ కోర్ట్ కు వెళ్ళాలి , మళ్ళి దాని గురించి ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తారు. చూడబోతే జగన్ కు గడ్డు కాలంలనే ఉంది.

ADVERTISEMENT
Latest Stories