కాపు రిజర్వేషన్లలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ మరో సెల్ఫ్ గోల్

YS Jagan Self goal on kapu reservationనిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కాపు రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇటీవలే కేంద్రం అగ్రవర్ణాల పేదలకు తెచ్చిన 10% రిజర్వేషన్ల లో కాపు, బలిజ, తెలగ కులాలకు 5% రిజర్వేషన్ కేటాయించాలంటూ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసింది. చంద్రబాబు వేసిన ఈ స్టెప్ తో ఉలిక్కిపడింది ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సాఆర్ కాంగ్రెస్. కాపులలో ప్రభుత్వానికి ఎక్కడ పాజిటివ్ వచ్చేస్తాదో అని కంగారు పడుతుంది ఆ పార్టీ. ముందు ఈ తీర్మానం కోర్టులలో నిలబడదు అని వాదించింది.

ADVERTISEMENT

ఇప్పుడు కొత్త పల్లవి అందుకుంది. ఇంతకీ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులను బిసిలుగా చూస్తారా?అగ్రవర్ణాలుగా చూస్తారా అని శాసనమండలిలో విపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. కాపులను బీసీలలో చేరుస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి ఇప్పుడేమో వారిని ఓసిలుగా మార్చారని విమర్శించారు. రిజర్వేషన్‌ పేరుతో చంద్రబాబు కాపులను దగా చేస్తున్నారని దుయ్యబట్టారు. కాపులకు ఎన్నిసార్లు రిజర్వేషన్లు ఇస్తారు చంద్రబాబూ.. అని ప్రశ్నిం చారు.

అయితే ఇందులో వైఎస్సాఆర్ కాంగ్రెస్ బాధ ఏంటో అర్ధం కాదు. కాపులను బీసీలలో చేర్చి వారికి 5% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందిగా శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. రిజర్వేషన్లు 50% శాతం దాటడంతో కేంద్రం చేస్తే రిజర్వేషన్లు పెరిగే పరిస్థితి. కేంద్రం సహకరించకపోవడంతో అది ఆగిపోయింది. ఇప్పుడు కాపులకు అగ్రవర్ణాల పేదలలో 5% రిజర్వేషన్ కలిపించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. కాపులను బీసీలు అనుకున్నా ఓసిలు అనుకున్నా వారికి చెప్పినట్టు 5% రిజర్వేషన్ అయితే ఇస్తున్నారు.

దీంట్లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు వచ్చిన బాధ ఏంటో? ఇటువంటి విమర్శల వల్ల వైఎస్సాఆర్ కాంగ్రెస్ కాపు రిజర్వేషన్లు జీర్ణించుకోలేక పోతున్నారు అనే మెస్సేజ్ ప్రజలలోకి వెళ్తుంది. ఇది వారికి ఎంత మాత్రం మంచిది కాదు. టీడీపీకి రాజకీయ లబ్ది రాకూడదు అనుకుంటే కోర్టులు దీనిని కొట్టేయాలని దండం పెట్టుకోవాలి. లేకపోతే తామే కోర్టులో వ్యాజ్యాలు వేయించాలి. అప్పుడు కూడా కోర్టు తీర్పు ఎన్నికల కంటే ముందు రావాలి. అంతే గానీ బహిరంగంగా దీనిపై విమర్శలు చేస్తే కాపులకు మంచి మెస్సేజ్ వెళ్ళదు.

ADVERTISEMENT
Latest Stories