వైసీపీకి చెందిన కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక ఈరోజు చంద్రబాబును కలిసారు. త్వరలోనే కర్నూల్‌లో బహిరంగసభ ఏర్పాటుచేసి టీడీపీలో చేరనున్న బుట్టా రేణుక. ఐతే రేణుక దీనిపై మాట్లాడకముందే సాక్షిలోనే మొదట ఈ వార్త వచ్చింది. జగన్ ఆమోదంతోనే ఈ వార్త వచ్చినట్టు సమాచారం.
పాదయాత్ర నేపధ్యంలో చాలా మంది సొంత పార్టీ ఎంఎల్ఏల మీద ఎంపీల మీద జగన్ నిఘా పెట్టినట్టు సమాచారం. వారు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనేది నిశితంగా పరిశీలిస్తున్నారట. అనుమానంగా వ్యవహరిస్తున్న వారిని ముందే వదిలించుకోవడం మంచిదని జగన్ ఉద్దేశం అట.
తద్వారా తమకేమీ దెబ్బ కాదని మెసేజ్ పంపాలని జగన్ ప్రయత్నం. ఐతే ఇలా సొంత వారినే నమ్మకపోవడం ఆ పార్టీ నాయకులకు రుచించడం లేదట. పైగా వారు మాట్లాడకముందే సాక్షిలో వారి మీద విమర్శలు చెయ్యడం వల్ల వారి మీద ఫిరాయింపు ముద్రపోయి పొమ్మనలేక పొగబేట్టారు అనే ముద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద పడుతుందని వల్ల భయం.
కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక తో మొదలయిన ఆపరేషన్ ఆకర్ష మొత్తం పాదయాత్ర జరిగే సమయంలో పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేలా ప్లాన్ చేస్తున్నారు. తద్వారా ప్రజల దృష్టికూడా పాదయాత్ర మీద కాకుండా ఈ చేరికాల మీదే ఉంటుంది. అలాగే ప్రతి ఒకరు వైకాపా బలహీనపడుతుందనే మాట్లాడుకుంటారు అనేది తెదేపా వారి వ్యూహం.
నవంబర్ 2 నుండి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహా పాదయాత్రకు సన్నధం ఆవతున్నారు. 6 నెలల పాటు 3600 కిలోమీటర్ల దూరం నడవాలని ఆయన ప్రణాళిక. ఈ ప్రక్రియలో ఆయన 120 నియోజకవర్గాలను కవర్ చెయ్యబోతున్నారు. ఈ పాదయాత్ర ఆయనను ముఖ్యమంత్రి సింహాసనంలో కూర్చోబెడుతుందని ఆయన నమ్మకం. ఐతే జగన్ పాదయాత్ర ముగిసేసరికి వైకాపాని ఖాళీ చెయ్యాలని తెదేపా లక్ష్యం.





