jagan

మూడు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీలో వైసీపిని విలీనం చేసేస్తారని, వైఎస్ షర్మిలని బయటకు గెంటేసి జగన్మోహన్‌ రెడ్డి కాంగ్రెస్‌ పగ్గాలు చేపడతారని చాలా ఊహాగానాలు వినిపించాయి.

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనే వంకతో జగన్‌ ఢిల్లీలో ధర్నా చేసి కాంగ్రెస్‌ మిత్రపక్ష నేతలతో భేటీ అవడం, లోక్‌సభ డెప్యూటీ స్పీకర్‌ ఎన్నిక విషయంలో వైసీపి ఎంపీలు మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం, బెంగళూరులో కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డికె శివ కుమార్‌తో భేటీ అయిన్నట్లు వార్తలు ఈ ఊహాగానాలకు బలం చేకూర్చాయి. బహుశః వైఎస్ షర్మిల కూడా ఈ ప్రమాదం పసిగట్టే జగన్మోహన్‌ రెడ్డిపై నిప్పులు చెరిగి ఉండవచ్చు.

Also Read – నిద్రలేపి తన్నించుకోవడం అంటే ఇదేనేమో?

కానీ ఆ తర్వాత కాంగ్రెస్‌లో వైసీపి విలీనం ప్రస్తావన వినపడలేదు. అంటే ఈ విలీనం ప్రతిపాదన పూర్తిగా అటకెక్కిపోయి ఉండవచ్చు లేదా ఇప్పటికిప్పుడు విలీనం చేయడం వలన రెండు పార్టీలకు ఎటువంటి రాజకీయ ప్రయోజనం ఉండకపోగా కొత్త సమస్యలు పుట్టుకురావచ్చని కనుక సరైన సమయం వచ్చినప్పుడు చేతులు కలుపుదామని ఆగి ఉండొచ్చు.

కానీ జగన్‌ మనసులో కాంగ్రెస్ పార్టీకి చోటు ఉందని హర్యానా ఎన్నికల ఫలితాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సూచించాయి.

Also Read – ఉద్వేగమా, ఉన్మాదమా ?!?!?

హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందని సర్వేలన్నీ బల్లగుద్ది వాదించగా బీజేపీ గెలిచి అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల ఫలితాలపై జగన్‌ స్పందిస్తూ, ఈవీఎంల వల్లనే బీజేపీ గెలిచి ఉండవచ్చన్నట్లు ట్వీట్‌ చేశారు.

నిజానికి జగన్‌కి పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో పార్టీలతో, అక్కడి రాజకీయాలతో సంబంధం లేన్నట్లు వ్యవహరిస్తుంటారు. కనుక ఎక్కడో ఉన్న హర్యానా ఎన్నికల ఫలితాల గురించి, అదీ.. బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం గమనిస్తే కాంగ్రెస్ పార్టీని దూరం చేసుకోలేదని సూచిస్తున్నట్లే ఉంది.

Also Read – జగన్‌… మరోసారి ఆ మాట అంటే కబడ్దార్!

కానీ కాంగ్రెస్‌తో చేతులు కలపాలనే జగన్‌ ప్రయత్నాలు ఫలిస్తాయా? అంటే రాజకీయాలలో ఏదైనా జరగవచ్చు కనుక వచ్చే ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో వైసీపి విలీనం అయినా ఆశ్చర్యం లేదు.