న్యాయస్థానాలలో ఎదురుదెబ్బలు తినడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సర్వసాధారణం అయిపోయింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురయ్యింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మార్పు వ్యవహారంపై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
రమేశ్ కుమార్‌ను కమిషనర్‌గా కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషీకేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అదే సమయంలో ఈ కేసులో జగన్ సర్కార్‌పై ధర్మాసనం తీవ్రస్థాయి లో వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ సంస్థలతో ఆటలు తగదని హెచ్చరించింది. అసలు అలాంటి ఆర్డినెన్స్‌ను ఎలా ఆమోదిస్తారని ఆశ్చర్యం ప్రకటించారు. ఆర్డినెన్స్ జారీ చేయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశాలు సంతృప్తికరగా లేవని..జస్టిస్ బాబ్డే వ్యాఖ్యానించారు.
ప్రతివాదులకు రెండు వారాల్లో నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు స్టే నిరాకరించడంతో నిమ్మగడ్డ తిరిగి ఛార్జ్ తీసుకునే అవకాశం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చాలా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. రమేష్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికలు జరిగితే ఇబ్బందులు తప్పవని అధికారపక్షం ఆందోళన చెందుతుంది.
Confused & Not Sure What to Watch on Amazon Prime, Netflix? Click Here





