జగన్.. చంద్రబాబుని చూసి నేర్చుకో…. బీజేపీ నేత

Jagan-Not-To-Repeat-Chandrababu's-Mistakeవిశాఖపట్నంలో గ్యాస్ లీక్ నేపథ్యంలో పర్యావరణం మీద పడబోయే ప్రభావం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొందరు నిపుణులు ఈ ప్రభావం జిల్లా మీద ఏకంగా దశాబ్దం పాటు ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో బీజేపీకి చెందిన ఒక స్థానిక నాయకుడు ఒక మీడియా డిబేట్ లో హుద్ హుద్ నాటి సమయంలో జరిగిన ఒక విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

“హుద్ హుద్ సమయంలో చంద్రబాబు గారు విశాఖలో పర్యటించారు. ఆ సమయంలో పోర్టు వల్ల వస్తున్న కాలుష్యం గురించి ప్రజలు ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. అప్పట్లో పోరు చైర్మన్ ని పిలిపించి… మీరేం చేస్తారో నాకు తెలీదు నెల సమయం ఇస్తున్నా… ఈ సమస్య పరిష్కారం అవ్వాలి… లేదంటి మీ పోర్టుని మూయించేస్తా,” అని వార్నింగ్ ఇచ్చారు.

ADVERTISEMENT

“ఆ అధికారి కూడా ఆ విషయాన్ని ఛాలెంజ్ గా తీసుకుని ఆ సమస్యని పరిష్కారించారు. ఆ అధికారి ఇప్పటి ప్రభుత్వంలో కరోనా నిరోధక చర్యలలో ముఖ్య అధికారిగా ఉండడం గమనార్హం,” అని ఆయన చెప్పుకొచ్చారు. పర్యావరణానికి సంబంధించిన వాటిలో జగన్ తీసుకోవలసిన జాగ్రత్తలు, పరిశ్రమలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోకుండా కటువుగా వ్యవహరించడం గురించి చెబుతూ ఆయన ఈ సంగతులు చెప్పుకొచ్చారు.

చంద్రబాబుని చూసి నేర్చుకోవాలి అన్నట్టు చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉండగా… విశాఖపట్నం గ్యాస్ లీకేజీ జరిగి ఐదు రోజులు కావొస్తున్నా ఇప్పటిదాకా ఒక్క అరెస్టు కూడా చెయ్యకపోవడం గమనార్హం. కంపెనీ మీద నమోదైన కేసులో కూడా చాలా సాధారణమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ADVERTISEMENT
Latest Stories