ఏఏఏ… రానీయమ్మ… రానియమ్మ… సినిమా పాట కాదు!

YS Jagan Yemmiganur Meeting

జగన్మోహన్‌ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్ధులను తిట్టాలన్నా స్క్రిప్ట్ చూసి దానిలో వ్రాసిన్నట్లు తిడుతుంటారని అందరికీ తెలిసిందే. కానీ ఇవాళ్ళ స్క్రిప్ట్ చూడకుండా, ఏమాత్రం తడబడకుండా ‘ఏఏఏ… రానీయమ్మ… రానియమ్మ… బాబుని రానీయమ్మ…” అని అనేశారు.

ADVERTISEMENT

ఇదేదో సినిమా పాటలా అనిపిస్తే అంతకంటే సంతోషం ఏముంటుంది? కానీ ఇది మేమంతా సిద్దం బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు, ఎమ్మిగనూరు సభలో జగన్‌తో సెల్ఫీ కోసం వస్తున్న ఓ అభిమానిని పోలీసులు అడ్డుకున్నప్పుడు జగన్‌ వారిని ఉద్దేశ్యించి ‘ఏఏఏ… రానీయమ్మ… రానియమ్మ… బాబుని రానీయమ్మ…” అని అన్నారు.

స్క్రిప్టులో ఆ డైలాగ్స్ లేనప్పటికీ జగన్‌ ఏ మాత్రం తడబడకుండా ఈ పదలన్నీ అలవోకగా పలికేశారు. ఈసారి ఆయన మాటలను గాక వాటిని పలికిన తీరు చూసి సభకు వచ్చిన జనం విరగబడి నవ్వారు. ఆ తర్వాత ఆ యువకుడితో జగన్‌ సెల్ఫీ కూడా దిగారు.

ఇది చూసినప్పుడు అందరికీ ఓ ధర్మ సందేహం కలుగక మానదు. అపరిచిత యువకుడితో సెల్ఫీ దిగినప్పుడు, ఇన్నేళ్ళుగా తన బటన్ నొక్కుడు పర్యటనలు వెళుతున్నప్పుడు రోడ్డు పొడవునా పరదాలు ఎందుకు కట్టించుకొన్నట్లు?బ్యారీకేడ్లు ఎందుకు పెట్టించుకున్నట్లు? దారి పొడవునా చెట్లు ఎందుకు నరికించేసిన్నట్లు?

అప్పుడు ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందనుకుంటే, ఇప్పుడు పరదాలు దాటి ప్రజల మద్యకు ఎందుకు వస్తున్నారు?అపరిచిత వ్యక్తులతో సెల్ఫీలు ఎందుకు దిగుతున్నారు?ఇది ప్రమాదం కాదా?

కాదనుకుంటే ఈ 5 ఏళ్లుగా ఇంత హంగామా ఎందుకు చేసిన్నట్లు? అన్ని పచ్చని చెట్లు ఎందుకు నరికించేసిన్నట్లు?జగన్‌లో హటాత్తుగా ఇటువంటి మార్పు ఎందుకు వచ్చింది?

ADVERTISEMENT
Latest Stories