ysr-ys-jagan-ys-sharmila-

డా. వైస్ రాజశేఖర్ రెడ్డి కొన్ని దశబ్దాల పాటు కాంగ్రెస్ రాజకీయాలలో నలిగినలిగి చిట్ట చివరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు ఆ పేరు కోసం రెండు పార్టీల నడుమ, ఇద్దరు వ్యక్తుల మధ్య రాజకీయ విభేదాలు మొదలయాయ్యి.

Also Read – అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ సర్వం సిద్దం

వైఎస్ఆర్ మా వాడంటే మా వాడు అంటు అటు కాంగ్రెస్ పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా తమ వారసత్వం కోసం “కుస్తీపట్లు” పడుతున్నాయి. అలాగే వైఎస్ఆర్ రాజకీయ వారసులం మేమే అంటే మేమే అంటు అటు వైస్ జగన్ ఇటు వైస్ షర్మిల “కుర్చీ పాట్లు” పడుతున్నారు.

కాంగ్రెస్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మధ్య ‘వైఎస్ఆర్’ నలిగిపోతున్నారు, జగన్ కు షర్మిలకు మధ్య ‘విజయలక్ష్మి’ తల్లడిల్లుతున్నారు. ఎవరిని దగ్గరకు తీసుకోవాలి…ఎవరిని దూరం పెట్టాలి అనే ఆలోచనతో విజయలక్ష్మి సతమతమవుతున్నారు. తండ్రి వారసత్వం ఎవరికీ కట్టబెట్టాలి…వైస్సార్ అభిమానులు ఏ పార్టీకి అండగా ఉండాలి అని తేల్చాలంటే కొడుకా.? కూతురా.? అనేది నిర్ణయించుకోవాలి.

Also Read – యావత్ దేశం దృష్టి విశాఖ పైనే…

నేడు వైఎస్ఆర్ 75 వ జయంతి పురస్కరించుకుని జరుపుతున్న వేడుకలలో వైస్సార్ కుటుంబంలో ఉన్న విభేదాలు మరోసారి మీడియాకెక్కాయి. పులివెందుల వైస్సార్ ఘాట్ దగ్గర తన తండ్రికి నివాళులర్పించడానికి వైస్ జగన్ తో పాటుగా వైస్ విజయమ్మ వచ్చారు. ఆ సమయంలో విజయమ్మ కన్నీటి పర్యంతం అయ్యారు. అయినా జగన్ తన తల్లి కన్నీటిని తుడిచి ఓదార్చలేకపోయారు.

వైస్సార్ మరణ వార్త తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారిని ఓదార్చడానికి మనసొచ్చిన జగన్ కు కన్నీరు పెట్టుకుంటున్నకన్న తల్లిని దగ్గరకు తీసుకుని ఓదార్చడానికి మనస్సు రాలేదా.? అంటు సోషల్ మీడియాలో జగన్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాను అంటు జగన్, తండ్రి ఆశయాల సాధన కోసం పోరాడుతున్నా అంటు షర్మిల ఇలా భిన్న వాదనలు వినిపిస్తున్నారు.

Also Read – జగన్ రెచ్చిపోతున్నారు..పవన్ పత్తాలేరు.?

వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున జగన్, కాంగ్రెస్ పార్టీ తరుపున షర్మిల ఒకే వ్యక్తికీ రెండు పార్టీల తరుపున వేరు వేరు జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. పార్టీల పరంగా విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా జగన్, షర్మిలకు వైస్సార్ తండ్రే కాబట్టి కనీసం ఆయన మనశాంతి కోసమైన, తల్లి విజయమ్మ సంతోషం కోసమైనా ఏ ఒక్కరు విభేదాలు పక్కన పెట్టి ముందడుగు వేయలేదు.

ఇదేనా వైఎస్ఆర్ వారసులుగా జగన్, షర్మిల ఆయనకు ఇచ్చే నివాళి. తండ్రి సమాధి వద్దకైన అన్న ఉంటే చెల్లి రాదు, చెల్లి ఉంటే అన్న వెళ్ళడు. చనిపోయిన వ్యక్తి రాజకీయ వారసత్వం కోసం పోటీ పడుతున్న అన్నాచెల్లి బ్రతికున్న తల్లికి మానసిక క్షోభ మిగులుస్తున్నారు. వీళ్ళ రాజకీయ ఆకాంక్షల కోసం ఇద్దరు వ్యక్తులు రెండు పార్టీలను అడ్డుపెట్టుకుని ఏపీలో రాజకీయం చేస్తున్నారు.




సొంత కుటుంబాల కోసం కూడా ఒక అడుగు వెనక్కి తగ్గడం కానీ ఒక అడుగు ముందుకు వేయడం కానీ తెలియని మనస్తత్వం ఉన్న ఇటువంటి వారు ప్రభుత్వాలు నడిపితే ఎలా ఉంటుందో గత ఐదేళ్ల పాలనలో స్పష్టంగా చూపించారు జగన్. తల్లి కన్నీటికి కానీ, చెల్లి ఆవేదనకు కానీ కనీస విలువ ఇవ్వలేని వాడు ప్రజల కోసం విలువలతో కూడిన రాజకీయం చేయగలుగుతాడా.?