వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్డీయేలో చేరితే తెలుగు బీజేపీ నేతలకు ఇబ్బందే

YS Jagan - Narendra Modiఇటీవలే బీజేపీ కేంద్ర బృందంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రామ్మాధవ్, మురళీధరరావు, జీవీఎల్ఎన్ రావులను పక్కన పెట్టింది ఆ పార్టీ అధిష్టానం. అయితే ఇందులో కనీసం ఇద్దరు నేతలకు ప్రమోషన్ దక్కనుందని సమాచారం. వీరిలో ఎవరైనా ఇద్దరినీ కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

ADVERTISEMENT

అయితే వైఎస్సార్ కాంగ్రెస్ గనుక కేంద్ర మంత్రివర్గంలోకి వస్తే… ఆ పార్టీకి ఒక కేబినెట్ బెర్త్… ఒక సహాయ మంత్రిత్వ శాఖ ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో ఒక్కరికే అవకాశం దక్కే అవకాశం ఉంది. అటువంటి తరుణంలో ఎవరికీ అవకాశం వస్తుందని అనేది ఆసక్తిగా మారింది. అయితే ఈ ముగ్గురి మీదా బీజేపీ అభిమానులు సానుకూలంగా లేరు.

వీరిలో ఒక్క నేత కూడా ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చెయ్యలేదు… భవిష్యత్తులో పోటీ చెయ్యగలిగే స్థాయిలో లేరు. అలాగే ఓటర్లను ప్రభావితం చేసే స్థాయి కూడా కాదు. అటువంటి వారికి మంత్రిపదవి కట్టబెట్టడం వల్ల ఉపయోగం ఉండదు అని వారి అభిప్రాయం. వారి వాదన కూడా నిజమే.

ఈ ముగ్గురు టీడీపీ వ్యతిరేకులే… రామ్ మాధవ్ లేక జీవీఎల్ఎన్ రావులకు అవకాశం వస్తే అది ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి మరింత చికాకుగా మారొచ్చు. ఇకపోతే… వైఎస్సార్ కాంగ్రెస్ ఒక కేబినెట్ బెర్త్… రెండు సహాయ మంత్రిత్వ శాఖలు ఆశిస్తుంటే.. బీజేపీ మాత్రం ఒక కేబినెట్ బెర్త్…ఒక సహాయ మంత్రిత్వ శాఖ ఇవ్వడానికి సుగుమంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories