వైసీపీ వారు ఏం చేస్తున్నారో వారికైనా అర్ధం అవుతుందా?

YS Jagan - YSRCP - Social Mediaరాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద కోర్టులు వ్యతిరేక తీర్పు ఇచ్చిన ప్రతిసారీ అధికార పార్టీ పాడే రొటీన్ పాట చంద్రబాబు కోర్టులను మ్యానేజ్ చేశాడు అనడం. ఇప్పటికే దాని మీద సిబిఐ విచారణ కూడా ఎదురుకుంటున్నారు ఆ పార్టీ నాయకులు, సోషల్ మీడియా మద్దతుదారులు. అయినా వారిలో మార్పు రానట్టుగా ఉంది.

తాజాగా వారు ఏకంగా ఆర్మీని టార్గెట్ చేశారు. ఎంపీ రఘురామరాజు కాళ్లకు గాయాలు ఉన్నాయని, కుడికాలి వేలికి ఫ్రాక్చర్‌ అయిందని సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి నివేదిక ఇవ్వడంతో సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కిందపడినా మాదే పై చెయ్యి అంటూ… కోర్టులను మ్యానేజ్ చేసిన వాడికి మిగిలిన వ్యవస్థలను మ్యానేజ్ చెయ్యడం ఒక లెక్కా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

ADVERTISEMENT

దేశాన్ని కాపాడే ఆర్మీని కూడా శంకించడం… రాజకీయ అవసరాలకు వాడుకోవడం పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. గతంలో చేసిన కోర్టులను మ్యానేజ్ చెయ్యడం అనే దానిని కొందరైనా హర్షించేవారేమో… ఇప్పుడు ఆర్మీని కూడా విమర్శించడం తీవ్ర వివాదాస్పదం అవుతుంది. వైసీపీ వారు ఏం చేస్తున్నారో వారికైనా అర్ధం అవుతుందా? అంటూ పలువురు అడుగుతున్నారు

దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యని వారు అమ్ముడుపోతారు అన్నట్టు విమర్శలు చేస్తే దేశాన్నే అవమానించినట్టు. ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ ఎంత తొందరగా తెలుసుకుని….. వారి కార్యకర్తలను నియంత్రిస్తే అంత మంచిది. అయితే దీనిపై వారి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

ADVERTISEMENT
Latest Stories