Jagan Sunitha

కేసీఆర్ ఓటమికి ముందు కవిత ఢిల్లీ లిక్కర్ కేసు ఒక అశకునంలా ఎదురుపడింది బిఆర్ఎస్ పార్టీకి. అయితే ఆ అపశకునాన్ని తక్కువ అంచనా వేసి ప్రజలను మభ్య పెట్టాలని చూసిన కేసీఆర్ బృందానికి ఎన్నికలలో తెలంగాణ ప్రజలు ఊహించని ఫలితాలను బహుమానంగా ఇచ్చారు.

తెలంగాణ ప్రజల రిటర్న్ గిఫ్ట్ తో అవాక్కయిన కేసీఆర్ కు కవిత కూడా మరో గిఫ్ట్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు ఆరోపణలు ఎదుర్కున్న కేసులో అరెస్టయ్యి తీహార్ జైలు లో సేదతీరుతున్నారు కవిత. ఇప్పుడు ఏపీలో జగన్ పరిస్థితి కూడా ఇంచుమించు కేసీఆర్ మాదిరే అని చెప్పవచ్చు.

కేసీఆర్ కు కవిత కేసు…జగన్ కు వివేకా హత్య కేసు. అక్కడ ఈడీ…ఇక్కడ చెల్లెల్లు సునీతా, షర్మిల. కేసీఆర్ ఎలా అయితే ఈడీనా…కేడినా…ఎవడొస్తాడో రండి అంటూ గాండ్రించారో, ఇక్కడ జగన్ తల్లా..చెల్లా ఎవరొస్తారో చూద్దాం అంటూ గాంభీర్యాలు పోతున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్ది జగన్ పాలిట వివేకా హత్య కేసు ఒక ఉరితాడుగా మారనుంది అనేది స్పష్టమయింది.

ఒక పక్క ప్రతిపక్షాలు ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ వైసీపీ ని ప్రశ్నిస్తుంటే… మరో పక్క ‘నా తండ్రి చావుకి న్యాయం కావాలి’ అంటూ జగన్ ను గర్జిస్తున్నారు సునీతా. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో కడప ఎంపీ గా వైస్ షర్మిల పేరుని ఖరారు చేసింది అధిష్టానం. షర్మిలకు మద్దతు ప్రకటిస్తూనే తన తండ్రి చావుకి కారణమైన వైసీపీ నేత అవినాష్ రెడ్డి ని ఓడించాలంటూ కడప ప్రజలను కోరారు సునీతా.

వివేకా హత్య జరిగిన సమయంలో తనను ఒక కీలుబామ్మగా మార్చి తమకు అనుకూలంగా మరల్చుకున్నారు, తన తండ్రి హత్య ను తన రాజకీయ అవసరాల కోసం వాడుకుని ఇప్పుడు అధికారం రాగానే దానికి కారణమైన వారిని కొమ్ముకాస్తూ సొంత చిన్నాన్నకు వెన్నుపోటు పొడిచారు జగన్ అంటూ వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు సునీత. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న ఇటువంటి పార్టీలను, నాయకులను అధికారం నుండి దూరం చేయాల్సిన బాధ్యత ప్రజల పై ఉంది అంటూ వ్యాఖ్యానించారు.

వివేహ హత్య కేసు గురించి చర్చించడానికి నేను మీ సాక్షి టీవీ కి వస్తాను. నాతో కలిసి మీ సాక్షి టీవిలో డిబేట్ చేసే దమ్ముందా అంటూ అటు జగన్ కు ఇటు అవినాష్ రెడ్డి కి సవాల్ విసిరారు సునీతా. సిద్ధం సిద్ధం…అంటూ మైకుల ముందు అరవడం కాదు దమ్ముంటే, మీలో నిజాయితీ ఉంటే సునీతా చేసిన సవాల్ కి జగన్ సిద్ధమా..? అంటూ జగన్ వ్యతిరేకవర్గమంతా వైసీపీ ని ట్రోల్ చేస్తున్నారు.

అధికారం వచ్చిన ఈ ఐదేళ్లలో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేక పోయారు…కనీసం అధికారం కోల్పోయే ముందు మీ సొంత ఛానెల్ లో మీ సొంత చెల్లెళ్ళతో…మీ సొంత బాబాయ్ కోసం డిబేట్ కు రావడానికి సిద్ధమా జగన్, పులివెందుల పులి ఆడవారితో కూడా చర్చకు రాలేరా అంటూ సోషల్ మీడియాలో వైసీపీ ని ఒక ఆట ఆడుకుంటున్నారు. కవిత పై వచ్చిన ఆరోపణలు తిప్పికొడుతూ కేసీఆర్…సునీతా చేస్తున్న ఆరోపణలు ఎదుర్కొంటు జగన్ ఇలా ఎన్నికలకు ముందు ఈ ఇద్దరికీ ఆడవారితోనే అపశకునాలు పలకరించాయి.