తెరపైకి బైబిల్ తో విజయమ్మ

YS Vijayamma back to politicsవైఎస్సాఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర 1000 కిలోమీటర్ల మార్క్ దాటింది ఈరోజు. దాదాపుగా మూడు నెలలుగా సాగుతున్న ఈ పాదయాత్ర పెద్దగా మీడియాపై గానీ ప్రజలపై గాని ప్రభావం చూపించలేకపోతుంది. ఈ క్రమంలో పాదయాత్రకు సెంటిమెంట్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు జగన్.

ఈ సందర్భంగా విజయమ్మ స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పించారు సాక్షిలో. 2014లో విశాఖపట్నంలో ఓటమి చెందిన తరువాత విజయమ్మ బయటకు వచ్చింది లేదు. అడపదడపా వచ్చిన పార్టీ మీద ఉన్న క్రిస్టియన్ మార్కు పోగొట్టడానికి ఆవిడ చేతిలో ఉన్న బైబిల్ పక్కన పెట్టించారు. బైబిల్ లేకుండానే కనిపించారు.

ADVERTISEMENT

అయితే ఈ సరికొత్త ఇంటర్వ్యూలో మాత్రం విజయమ్మ బైబిల్ తో కనిపించారు. మరి దీని మీద పార్టీ వ్యూహం ఏంటో? యధాప్రకారం కాంగ్రెస్ అన్యాయం చేసిందని, జగన్ ను కేసులలో ఇరికించిందని, జగన్ మాట ఇస్తే తప్పడని రకరకాలుగా ప్రజలలో జగన్ ఇమేజ్ ను పెంపొందించేలా మాట్లాడారు విజయమ్మ.

ADVERTISEMENT
Latest Stories