కొడుకు కోసం విజయమ్మ స్తోత్రం… కూతురిని వదిలేసిన్నట్లేనా?

YS Vijayamma Blessings To YS Jagan Bus Yatra

సుమారు రెండేళ్ల క్రితం విజయమ్మ కన్నీళ్ళు పెట్టుకొంటూ వైసీపీని విడిచి పెట్టి వెళ్ళారు. ఆమె వెళ్ళారనే కంటే జగనే తల్లిని బయటకు సాగనంపారనేది వాస్తవం. కానీ తెలంగాణలో పార్టీ పెట్టుకొని ఒంటరిగా పోరాడుతున్న కూతురు షర్మిలకు అండగా నిలవాలని పార్టీని వీడుతున్నానని ఆ తల్లి సర్ధి చెప్పుకొని కొడుకు జగన్మోహన్‌ రెడ్డిని నిండు మనసుతో ఆశీర్వదించి వెళ్ళిపోయారు.

ADVERTISEMENT

ఆ తర్వాత వైఎస్ షర్మిల అక్కడ దుకాణం కట్టేసి ఏపీ కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టడంతో విజయమ్మ కూడా ఏపీకి తిరిగివచ్చేశారు. కానీ ఆమె కోసం తెలంగాణ వెళ్ళిన విజయమ్మ, ఆమె వద్దకు వెళ్లకుండా కొడుకు వద్దకు వెళ్ళారు. కొడుకుల దగ్గర తల్లితండ్రులు ఉండటం సహజం కనుక ఆమె నిర్ణయాన్ని ఎవరూ తప్పు పట్టలేరు.

అయితే కొడుకు, కూతురు రాజకీయ విరోధులుగా మారి పరస్పరం కత్తులు దూసుకొంటున్నప్పుడు బహుశః ఆమె వారించి రాజీకి ప్రయత్నించి ఉండవచ్చు. కానీ నేటికీ వారు కత్తులు దూసుకొంటున్నారు కనుక ఆమె ప్రయత్నాలు ఫలించలేదని స్పష్టం అయ్యింది.

విజయమ్మ ఏసు ప్రభువును, న్యాయాన్ని, ధర్మాన్ని నమ్ముకున్నారు కనుక ఆమె కొడుకు, కూతురు అని కాకుండా ధర్మం, న్యాయం ఎవరివైపు ఉందో అటువైపు ఉంటారని అందరూ ఆశిచడం సహజం. కానీ ఆ తల్లి మనసు కొడుకు మీద ప్రేమకు లొంగిపోయీ అతని వైపు మొగ్గు చూపారు.

ఈరోజు జగన్మోహన్‌ రెడ్డి ‘మేమందరం సిద్దం’ బస్సు యాత్రకు బయలుదేరే ముందు ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. దానిలో విజయమ్మతో సహా పలువురు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె పాస్టర్ నుంచి మైక్ తీసుకొని కొడుకు జగన్మోహన్‌ రెడ్డికి, ఆయన సైన్యానికి అండగా నిలబడాలని, ఆయనకు ఎన్నికలలో విజయం కల్పించాలని ఏసు ప్రభువుని ప్రార్ధించారు. ఆ తర్వాత కొడుకుని హత్తుకొని ముద్దు పెట్టుకొని ఆశీర్వదించి పంపారు.

తనను, తన కూతురిని కూడా కర్కశకంగా బయటకు పంపించిన కుమారుడుని ఒక్క తల్లి మాత్రమే క్షమించగలదని ఆమె మరోసారి నిరూపించారు. ఇందుకు ఆమెను తప్పు పట్టలేము.

కానీ ఆనాడు కూతురుకు అండగా ఉంటానని చెప్పి వెళ్ళిన ఆమె ఇప్పుడు కొడుకు పక్షాన్న చేరడం, ఈ విషయాన్ని వైసీపి సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియబరచడాన్ని ఏమనుకోవాలి?

తల్లి ప్రేమతో కొడుకు గెలవాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం… కోట్లాది మంది ప్రజల సంగతి ఏమిటి?కూతురు షర్మిల పరిస్థితి ఏమిటి? వీరందరి కంటే కొడుకే ముఖ్యమా?

విజయమ్మ కొడుకు వైపే ఉన్నట్లు తేల్చి చెప్పేశారు కనుక నేడో రేపో వైసీపి తరపున ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనవచ్చు. అప్పుడు కూతురు గురించి ఆమె ఏమి చెపుతారో?

ADVERTISEMENT
Latest Stories