ఈసారి ఎన్నికలలో జగన్ కు ఒక ప్రతిపక్షం కూటమి పార్టీలు కాగా మరో ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది వైస్ కుటుంబం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అందిపుచ్చుకున్న వైస్ షర్మిల ఒక పక్కన, ఆమెకు మద్దతుగా అడుగు ముందుకేసి తన తండ్రి చావుకి న్యాయం కావాలంటూ పోరాడుతున్న వివేకా కుమార్తె సునీత మరో పక్క వైసీపీ పార్టీకి, వైస్ జగన్ కు పక్కలో బల్లెం మాదిరి గుచ్చుతున్నారు.
అయితే వీరిద్దరి విమర్శల వెనుక చంద్రబాబు వ్యూహం ఉందని, టీడీపీ స్క్రిప్ట్ ప్రకారమే సునీత, షర్మిల తమ పై విమర్శలు చేస్తూ నిందలేస్తున్నట్లు తన సొంత మీడియాలో ప్రచారం చేసుకుంటున్న జగన్ ఇప్పుడు అదే విషయాన్ని బహిరంగ వేదికల మీద కూడా ప్రస్తావిస్తున్నారు. గతంలో తన బాబాయ్ వివేకా హత్యకు బాబే కారణంటూ ఆరోపించిన జగన్ ఇప్పుడు ఆయన పాత్రలోకి దస్తగిరిని చేర్చారు.
దీనితో 2019 ఎన్నికలలో టీడీపీ పైన చంద్రబాబు మీద చేసిన ఆరోపణలు అవాస్తమని
జగనే ఒప్పుకుంటున్నట్లేగా..? అంటూ టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నా వైసీపీ మాత్రం ఏమో సార్ మాకు కనపడవు అంటూ మాటదాటేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వివేహ కేసును అడ్డుపెట్టుకుని జగన్ కి అవినాష్ రెడ్డి కి చెక్ పెట్టాలని భావిస్తున్న సొంత చెల్లెళ్లను కూడా కనికరించలేదు వైసీపీ కాలకేయ సైన్యం.
సునీత, షర్మిల, వివేకా వ్యక్తిగత జీవితాలను సోషల్ మీడియా తెర మీద ఆవిష్కరించి వారిని కట్టడి చేయాలనీ భావించిన జగన్ కు తన నామినేషన్ రోజే తన చిన్నమ్మ, వివేకా సతీమణి సౌభాగ్యమ్మ షాక్ ఇచ్చారనే చెప్పాలి. పులివెందులలో జగన్ నామినేషన్ కార్యక్రమం జరుగుతున్న వేళ సౌభాగ్యమ్మ జగన్ కు బహిరంగ లేఖ రాసారు. నీ తండ్రి వైస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు నువ్వెంత మనోవేదన చెందావో వివేకా హత్య జరిగిన నాటి నుండి నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదనకు గురయ్యింది.
ఇటువంటి సందర్భంలో అన్నగా చెల్లికి అండగా నిలవాల్సిన నువ్వు ఇలా వివేకా హత్యకు కారణమైన వారికి రక్షణగా నిలవడం నీకు తగునా జగన్..? అంటూ ప్రశ్నించారు. అలాగే సునీత కు అండగా నిలబడిన నీ సొంత చెల్లి షర్మిలను కూడా టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న నువ్వు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం ఏమిటి..? అంటూ తన ఇన్నేళ్ల మనోవేదనను ఒక లేఖ రూపంలో బయటపెట్టారు జగన్ చిన్నమ్మ.
అయితే ఇప్పుడు ఈ సౌభాగ్యమ్మ మనోవేదనకు కూడా బాబే కారణమని, ఆమె రాసిన లేక కూడా టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ అని జగన్ దీనిని కూడా కొట్టిపడేస్తారేమో. ఇంతమంది ఒకరి వైపే వేలెత్తి ఆరోపణలు చేస్తుంటే ఆ ఎత్తిన వేళ్ళని ఒక్కరివే అవి చంద్రబాబు వే అంటూ జగన్ అండ్ కో చేస్తున్న వితండవాదన నమ్మడానికి సాధ్యమేనా..? వైసీపీ సునీత, షర్మిల, వివేకా పై మొదలుపెట్టిన సోషల్ మీడియా దాడి ఇప్పుడు తన తల్లితో సమానమైన చిన్నమ్మ మీద కూడా కొనసాగిస్తారేమో చూడాలి.




