పిఠాపురంలో వైసీపీ మూకల వికృత చేష్టలు…

YSRCP Attack On Sai Dharam Tej

గోతులు, బూతులు, దాడులే వైసీపీ ఎన్నికల ప్రణాళిక అంటూ వైసీపీ నాయకుల పైన విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్ మాటలు అక్షర సత్యం అన్నట్టుగా వైసీపీ మూకల దాష్టికాలు నానాటికి పేట్రేగిపోతున్నాయి.

ADVERTISEMENT

తన మేనమామ గెలుపు కోసం తనవంతు భాగంగా పిఠాపురం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సాయి ధర్మ తేజ పై వైసీపీ అనుచరులు దాడికి యత్నించారు. పిఠాపురం నియోజకవర్గంలోని తాడిపత్రి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న జనసేన నేతలు సందీప్ పంచకర్ల తో కలిసి సాయిధరమ్ తేజ కూడా రోడ్ షో లో పాల్గొన్నారు.

గొల్లప్రోలు మండలంలో పవన్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్న సాయిధర్మ తేజ పై గాజు సీసాలతో దాడి చేసారు. అయితే ఈ దాడిలో సాయిధర్మ తేజ్ తప్పించుకోగా అక్కడే ఉన్న జనసేన అభిమాని నల్ల శ్రీధర్ కు ఆ గాజు సీసా తగిలి తలకు తీవ్ర గాయమయ్యింది. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

అయితే పవన్ కు మద్దతుగా వచ్చిన సాయిధర్మ తేజ్ ను మొదటి నుండి టార్గెట్ చేస్తూ వెబడించారు వైసీపీ మూకలు. తాడిపత్రి గజ్జలమ్మ దేవాలయం ఎదుట కూడా ఇలానే జనసేన నేతలను కవ్విస్తూ టపాసులు పేలుస్తూ, వాగ్వాదానికి దిగి ఘర్షణ వాతావరణాన్ని సృష్టించారు వైసీపీ కిరాయి గుండాలు.

ఇటీవలే ఒక బైక్ ప్రమాదం నుండి తప్పించుకుని ప్రాణాలు నిలబెట్టుకున్న సాయి ఇప్పుడిప్పుడే యాధస్థితికి చేరుకుంటున్నారు. ఇటువంటి సందర్భాల్లో ఇలా గాజు సీసాల దాడిలో సాయికి ఎటువంటి ప్రమాదమైన జరిగి ఉంటే మెగా కుటుంబం మొత్తం రోడ్ల మీదకు వచ్చి ఉండేది. అలాగే మెగా అభిమానులు వైసీపీ మధ్య అల్లర్లు చెలరేగేవి.

ఇలా పిఠాపురంలో అల్లర్లు సృష్టించి ఇక్కడ పవన్ రాకతో ఎదో జరిగిపోతుంది అనే భయాందోళనలోకి స్థానిక ప్రజలను తీసుకు వెళ్ళడానికే వైసీపీ ఈ రకమైన దాడుల వ్యూహాన్ని ఎంచుకుంది అంటూ మండిపడుతున్నారు కూటమి మద్దతుదారులు. ఇక తాడిపత్రిలో జరిగిన ఈ దాడులతో ఎలర్ట్ అయినా టీడీపీ నేత వర్మ దాడిలో గాయపడిన వారిని పరామర్శిస్తూ కడప నుంచి గుండాలను రప్పించి జగన్ ఈ తరహా దాడులకు పాల్పడుతన్నాడు అంటూ వర్మ ఈ దాడులను ఖండించారు.

జగన్ పై ఒక గులక రాయి పడి నుదుటన చిన్న గాయమైతేనే ముఖ్యమంత్రి పై హత్య ప్రయత్నం అంటూ హెడ్డింగులు పెట్టిన జగన్ అనుకూల మీడియా కనీసం ఈ వార్తను కూడా ప్రచారం చేయలేకపోయింది. అలాగే జగన్ ను అంతమొందించడానికి బాబు ఈ గులకరాయి దాడికి ప్రయత్నించారు అంటూ మీడియా ముందు కథలు వినిపించిన వైసీపీ నేతలు ఈ వైసీపీ మూకల గాజు సీసాల దాడిని సమర్థిస్తారా..? లేక ఇది కూడా బాబు ఖాతాలో వేసి చేతులు దులుపుకుంటారా.? అనేది వేచి చూడాలి.

ADVERTISEMENT
Latest Stories