నాడు సమర్ధింపులు నేడు సమర శంఖాలా.?

YSRCP Double Standards

ఒక రాజకీయ నాయకుడిగా పాటించాల్సిన కనీస విలువలు, అలాగే ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన కనీస విశ్వసనీయత, కూడా లేకుండా వైసీపీ రాజకీయం నడుపుతుందా అన్నట్టుగా ఆ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు, ప్రత్యర్థి పార్టీల నేతలను రెచ్చకొడుతున్నారు.

నాటి పాలకపక్షం నుంచి నేటి విపక్షం వరకు వైసీపీ రాజకీయంలో ఏ మాత్రం మార్పు లేదు, రాదు అనేలా వైసీపీ ముందుకెళ్తుంది. తానూ చేస్తే నీతి, ప్రత్యర్థి చేస్తే బూతు అన్నట్టుగా వైసీపీ రాజకీయం సాగుతుంది. ఇప్పటికి వైసీపీ పార్టీ ఆవిర్భావం జరిగి దాదాపు 15 ఏళ్ళు పూర్తి కావస్తుంది.

ADVERTISEMENT

ఈ పదిహేనేళ్లలో గత ఐదేళ్లు మినహాయిస్తే మిగిలిన దశాబ్దం వైసీపీ ని ప్రజలు తిరస్కరించారు. అయితే ఆ తిరస్కరణ వై.? అంటూ వైసీపీ అంతర్గతంగా ప్రశ్నించుకుంటే ఆ వై కి సరైన జవాబు దొరుకుతుంది. కానీ వైసీపీ ఆ వై ని పక్కన పెట్టి వాట్ అంటూ టీడీపీ ని కవ్విస్తుంటే వైసీపీ 2.0 కలను వైస్ జగన్ నిజం చేసుకోగలరా.?

నాడు టీడీపీ నాయకులు బోండా ఉమా కారు మీద ఇనుప రాడ్లతో వైసీపీ నేతలు చేసిన దాడులను ప్రోత్సహించిన వైసీపీ, నాటి ప్రతిపక్ష నేత బాబు ఇంటి పై జోగి కర్రలతో దాడికి ప్రయత్నించిన సందర్భాన్ని తప్పేముంది అంటూ సమర్ధించిన జగన్ నేడు అంబటి ఫ్లెక్సీ తొలగింపు ప్రక్రియలో టీడీపీ నేతల అడ్డగింపులను తప్పుపడుతున్నారు వై.? అంటూ టీడీపీ ఎదురు ప్రశ్న వేసే అవకాశం ఉంది.

అలాగే నాడు వైసీపీ నేతల గంట అరగంట భాగోతాలు, అనంతబాబు డోర్ డెలివరీల అరాచకాలను, గోరంట్ల విశ్వరూపాలను ఆస్వాధించిన జగన్ నేడు అరవ శ్రీథర్ విషయంలో విలువలు అంటూ ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఇలా వైసీపీ దాని అధినేత వైస్ జగన్ తానూ చేస్తే నీతని అదే ఎదుటివాడు చేస్తే బూతు అంటూ నానా హంగామా చేస్తున్నారు వై.? అంటూ జనసేన గర్జిస్తుంది.

ఇక నాడు జగన్ ను వేలెత్తి చూపితే మా పార్టీ శ్రేణులకు బీపీలు వస్తాయి అంటూ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ రాష్ట్రంలో దాడులకు అధికార ముద్ర వేశారు. అప్పటి టీడీపీ పార్టీ కార్యాలయ ధ్వంసాలకు పరోక్ష అంగీకారం తెలిపారు. మరి ఇప్పుడు అంబటి వ్యాఖ్యలకు టీడీపీ శ్రేణులకు బీపీ లు రాకూడదా వై.? అంటూ బాబు ఎదురు ప్రశ్న

వేస్తె అందుకు వైసీపీ వద్ద జవాబు ఉంటుందా.?

నాటి బాబు అరెస్టు సక్రమం అంటూ సమర్ధించుకున్న వైసీపీ నేటి లిక్కర్ స్కాం కేసులో అరెస్టులను అక్రమమం అంటూ హంగామా చేస్తుంది వై.? నాడు టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఉచిత ఇసుక మీద కూడా అవినీతి అంటూ గగ్గోలు చేసిన వైసీపీ నేడు తిరుమల లడ్డు కల్తీ విషయంలో కల్తీ ప్రచారానికి సిద్దమయ్యింది వై.? ఇలా వైసీపీ నాటి తన చర్యలను సమర్ధించుకుంటూ నేటి కూటమి చర్యల పై సమర శంఖాలు పూరించేందుకు సిద్దమయ్యింది.

ADVERTISEMENT
Latest Stories