చంద్రబాబు విధానాలే ఫాలో అయ్యేదానికి ఆయనకే ఓటు వేసేవాళ్ళం కదా?

Chandrababu Naidu- నిరర్ధక ఆస్తుల పేరిట తమిళనాడు లో తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన 23 ఆస్తులు వేలం వెయ్యడానికి సిద్ధమైంది టీటీడీ. దీనికి సంబంధించిన జీఓ కూడా వచ్చేసింది. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుంది. స్వామి వారి ఆస్తులు చౌక ధరలకు అనుయాయులకు కట్టబెట్టడానికి ప్రభుత్వం ఈ ప్లాన్ వేసిందని పలువురు ఆరోపణ.

దీనిని డిఫెండ్ చేసుకోలేక కష్టపడుతుంది అధికారపక్షం. ఒక మంత్రి గారు… టీటీడీ నిర్ణయాలతో ప్రభుత్వానికి సంబంధంలేదని చెప్పుకొచ్చారు. ఇంకొకరు ఈ నిర్ణయం గతంలో టీడీపీ హయాంలో అప్పటి టీటీడి బోర్డు తీసుకుందని, అదే ఇప్పుడు అమలు అవుతుందని, టీడీపీ వారు చేస్తే ఒప్పు మేము చేస్తే తప్పా అంటూ ప్రశ్నిస్తున్నారు.

ADVERTISEMENT

అయితే ఈ వాదనతో ఒప్పుకునే వారు కనిపించడం లేదు. “టీడీపీ హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించి, అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని ప్రకటించారు. మరి టీటీడీ విధానాలు ఫాలో అయినప్పుడు దానిని ఎందుకు ఫాలో అవ్వరు? మూడు రాజధానుల ప్రతిపాదన వదిలేస్తారా?,” అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు విధానాలే ఫాలో అయ్యేదానికి ఆయనకే ఓటు వేసేవాళ్ళం కదా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. తమ వాదనను సమర్ధించుకునే ప్రయత్నం లో లాజిక్ మిస్ అయినట్టు ఉన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు. తిరుమల వంటి సున్నితమైన అంశంలో జగన్ ప్రభుత్వం పట్టువిడుపులు ప్రదర్శిస్తే వారికే మంచిది.

ADVERTISEMENT
Latest Stories