వైసీపీ, బిఆర్ఎస్‌ యుద్ధాలు… ఎవరిని మభ్యపెట్టడానికి?

YSRCP Ministers Responds On Harish Rao Comments On Andhra Pradeshఏపీ, తెలంగాణ మంత్రుల మద్య జరుగుతున్న ఈ మాటల యుద్ధాలను అందరూ చూస్తూనే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఘర్షించుకొంటున్నప్పటికీ, బిఆర్ఎస్‌, వైసీపీ మంత్రులు, నేతల మద్య మంచి అవగాహన, బలమైన స్నేహ సంబందాలు ఉన్నాయని అందరికీ తెలుసు. రోజా మంత్రి పదవి చేపట్టగానే హైదరాబాద్‌లో కేసీఆర్‌ ఇంటికి వెళ్ళి వారి ఆశీర్వచనం తీసుకోవడం, మన గుడ్డు మంత్రి గుడివాడ, తెలంగాణలో పనిచేసే మంత్రి కేటీఆర్‌తో కలిసి ఫార్ములా వన్ కార్ రేసింగ్ ఎంజాయ్ చేయడం, అలాగే సంక్రాంతి వస్తే తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ భీమవరంలో కోడి పందేలు చూసి, మనమంత్రులు వడ్డించే కమ్మటి చేపల పులుసు, కోడి కూర తిని వెళుతుంటారు. కనుక వీరి మద్య ఇంత బలమైన స్నేహసంబంధాలున్నప్పుడు విభజన సమస్యలు, నదీ జలాలు, ఆస్తులు, అప్పుల సమస్యలను ఎందుకు పరిష్కరించుకోలేకపోతున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అది అప్రస్తుతం. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ మాటల యుద్ధాన్ని రెండు విదాలుగా చూడొచ్చు.

1. ప్రస్తుతం రెండు ప్రభుత్వాలు అనేక తీవ్ర సమస్యలలో చిక్కుకొని ఉన్నాయి కనుక ఈవిదంగా కూడబలుకొన్నట్లు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకొంటుంటే, ఇక్కడ ఏపీలో ఆంధ్రా సెంటిమెంట్, అక్కడ తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ రగులుతుంది. అప్పుడు అందరి దృష్టి ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సమస్యలపై నుంచి వీరి మాటల యుద్ధంపైకి మళ్ళుతుంది. అంటే బిఆర్ఎస్‌, వైసీపీ కత్తులు దూసుకొంటూ పరస్పరం సహకరించుకొంటున్నాయన్న మాట! గత ఏపీ శాసనసభ ఎన్నికలలో కేసీఆర్‌ తెర వెనుక నుంచి వైసీపీకి సహకరించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు తోడ్పడ్డారు కనుక మళ్ళీ వచ్చే ఎన్నికలలో వైసీపీని గెలిపించేందుకే టిఆర్ఎస్‌ పేరు బిఆర్ఎస్‌గా మార్చుకొని ఏపీలోకి వస్తున్నారేమో?ఏపీలో ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు చీల్చి టిడిపి, జనసేనలను దెబ్బతీయడానికే వస్తున్నారేమో?అనే సందేహాలున్నాయి.

ADVERTISEMENT

2. తెలంగాణలో వేరే ఏ పార్టీ అడుగుపెట్టడానికి వీల్లేదన్నట్లు కేసీఆర్‌ ప్రవర్తిస్తున్నట్లే, ఇక్కడ ఏపీలోకి బిఆర్ఎస్‌ అడుగుపెట్టకూడదన్నట్లు వైసీపీ వ్యవహరిస్తున్నట్లు భావించవచ్చు. ఇప్పటికే టిడిపి, జనసేన, బిజెపిలతో ఓట్లు చీలి వైసీపీ నష్టపోయే ప్రమాదం ఉందని భయపడుతున్న వైసీపీ, ఇప్పుడు బిఆర్ఎస్‌ పార్టీ కూడా వస్తే ఇంకా ఓట్లు చీలి నష్టపోతామనే భయం కనిపిస్తోంది. కానీ కేసీఆర్‌ పుణ్యమాని మనవాళ్లు కూడా ఆంద్రా సెంటిమెంట్ పండించగలుగుతున్నారు కదా?కనుక వైసీపీ, బిఆర్ఎస్‌ మంత్రుల మద్య జరుగుతున్న ఈ మాటల యుద్ధాలను నిజమని నమ్మడం అవివేకం, రాజకీయ అజ్ఞానమే అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories