YSRCP MLA Ambati Rambabuవైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే. అయితే గతంలో ఒకసారి ఆయన కాపులు తాగుబోతులు… ఎక్కువ తాగుతూ ఉంటారు అని వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. ఆ వ్యాఖ్యల గురించి ఒక ఇంటర్వ్యూలో అంబటి రాంబాబుని మళ్ళీ అడిగారు. అయితే వారి పై ఆయన తన అభిప్రాయం మార్చుకున్నట్టుగా కనిపించలేదు.

“నేను ఒక సామాజిక వర్గంలో పుట్టాను. నాకు ఆ సామాజిక వర్గం మీద ఉన్న అభిప్రాయం నేను చెప్పాను. తెలివి తక్కువ వాళ్ళు. అవేశపరులు. మాంసం ఎక్కువ తింటారు. మందు బాగా తాగుతారు. ఇవన్నీ ఉన్నాయి. అందరు తాగుతారు చాలా మంది తాగుతారు. కానీ ఆ కమ్యూనిటీలో అవి ఎక్కువగా ఉన్నాయి,” అన్నారు ఆయన.

దానికి ఆ యాంకర్ సర్వే ఏమైనా చేశారా ఏంటి మీరు అని అడిగితే… “సర్వే అవసరం లేదు. తెలివి తక్కువ వాళ్ళు అని నా ఉద్దేశం,” అని చెప్పుకొచ్చారు ఆయన. ఇది ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోలో ఉన్న అంశాలు. ఒకవేళ పూర్తి ఇంటర్వ్యూలో కూడా ఇదే విధంగా ఉంటే అంబటితో పాటు అధికార పార్టీకి కూడా నష్టమే.

వ్యసనపరులు అన్ని సామాజికవర్గాలలోనూ ఉంటారు. దానిని జెనరలైజ్ చేసి కాపులు తాగుబోతులు అనడం దారుణం. పైగా ఇదే విషయంగా గతంలో పెద్ద వివాదమే జరిగినా ఎంత మాత్రం ఆత్మవిమర్శ లేకుండా మళ్ళీ అటువంటి మాటలే మాట్లాడటం దారుణం. చూడాలి దీనిపై ఆ సామాజిక వర్గం వారు ఎలా స్పందిస్తారో!