ఎన్నో ఏళ్ల తరువాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘ఖైదీ నంబర్ 150’ సినిమా విడుదలకు సిద్ధమయిన వేళ ఒకప్పటి హీరోయిన్\, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. చిరంజీవి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన చేసే డ్యాన్సేనని, 9 ఏళ్ల తరువాత మళ్లీ రావడం అందరికీ సంతోషాన్నిస్తోందని చెప్పారు.
చిరంజీవి చేసే ఫైట్స్ కూడా అద్భుతంగా ఉంటాయని, తాను ఆయనతో కలిసి ముఠామేస్త్రీ, ముగ్గురు మొనగాళ్లు, బిగ్‌బాస్ తదితర సినిమాల్లో నటించానని, ఆయనతో కలిసి వర్క్ చేసేటప్పుడు డ్యాన్స్ చేసేటప్పుడు చాలా కాంపిటీషన్‌గా అనిపించేదని, ఆయనతో చేసిన పలు సాంగ్స్ చాలా హిట్ అయ్యాయని అన్నారు.
‘ఖైదీ’ సినిమా ఎంత పేరు తీసుకొచ్చిందో… ఈ సినిమా కూడా చిరంజీవికి అంతే పేరు తీసుకురావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు రోజా తెలిపారు. చిరంజీవి నటించిన సినిమాలలో తనకు వ్యక్తిగతంగా బాగా నచ్చిన సినిమా విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆపద్బాంధవుడు’ అని, కమర్షియల్ సినిమాలే కాకుండా మంచి సినిమాలు చేసి జాతీయ అవార్డులు పొందారని ప్రశంసలతో ముంచెత్తారు.



