ఇక దువ్వాడ జీవితం మాధుర్యమే

YSRCP MLC Duvvada Srinivas Suspended From Party

కొందరు రాజకీయ నాయకులు మంచి వ్యూహకర్తలుగా పేరు సంపాదిస్తే మరికొందరు చక్కటి వాక్చాతుర్యం గల మంచి వక్తలుగా గుర్తింపు పొందుతారు. కొందరు అవినీతి, అక్రమాలకు మారుపేరుగా గుర్తింపు పొందితే మరికొందరు సమర్ధులైన పాలకులుగా గుర్తింపు పొందుతారు.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులతో గుర్తింపు సంపాదించుకుంటే యధారాజా తధా ప్రజా అన్నట్లు ఓ ఎంపీ వివేకా హత్య కేసుతో పాపులర్ కాగా మరో ఎంపీ మద్యం కుంభకోణంతో మరొకరు పోర్టు కబ్జా చేసి పాపులర్ అయ్యారు.

ADVERTISEMENT

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడిని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఏకైక రాజకీయ నాయకుడుగా చాలా పాపులర్ కాగా మరో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య, పెళ్ళీడున్న కుమార్తెలు ఉండగానే దివ్వెల మాధురి అనే వైసీపీ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని పాపులర్ అయ్యారు.

ఇలా వైసీపీలో ఎవరిని కదిపినా కనీసం గంటా అర గంటసేపు చెప్పుకోగల ఓ గొప్ప ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుంది. ఇంతకీ విషయం ఏమిటంటే, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ పార్టీ క్రమ శిక్షణ ఉల్లంఘిస్తున్నందుకుగాను దువ్వాడ శ్రీనివాస్‌ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది.

ఆయన అక్రమ సంబంధంతో రచ్చకెక్కినప్పుడే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ వైసీపీలో గంట, అరగంట వీరులు అనేక మంది ఉన్నప్పుడు మరొకరి ఇంట్లో ప్రేమ దివ్వె వెలిగించి జీవన మాధుర్యం గ్రోలుతున్న తుమ్మెద వంటి దువ్వాడ శ్రీనివాస్‌పై వేటు వేయాల్సిన అవసరం ఏముంది?అని జగన్‌ అనుకున్నారో ఏమో ఇంతకాలం ఉపేక్షించారు.

కానీ దువ్వాడ శ్రీనివాస్ పార్టీ కార్యక్రమాలకంటే మాధురితో చెట్టాపట్టాలేసుకొని తీర్ధయాత్రలు చేస్తూ, రీల్స్ చేసుకుంటూ, టీవీ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తూ చాలా బిజీబిజీగా గడుపుతుంటంతో పార్టీ నుంచి సస్పెండ్ చేయక తప్పలేదు.

కనుక ఇప్పుడు దువ్వాడ తన పూర్తి సమయం దివ్వెల మాధురికి కేటాయించి ఆమెతో జీవన మాధుర్యం అనుభవించవచ్చు.
దువ్వాడ ఇకపై ఆమెకే పరిమితమైతే పరవాలేదు కానీ ఎలాగూ ఫ్రీ టైమ్ పెరిగింది కదాని మరొకరి ఇంట్లో ప్రేమ దీపం వెలిగిస్తేనే మాధురికి కోపం వస్తుంది!

అలాగే పోతూపోతూ జగన్‌ గురించి, శ్రీకాకుళం జిల్లాలోని వైసీపీ నాయకుల గురించి దువ్వాడ శ్రీనివాస్ ఏమైనా నాలుగు ముక్కలు మాట్లాడినా ఇబ్బందే.

ADVERTISEMENT
Latest Stories