సోషల్ మీడియాలో అడ్డంగా దొరికిన వైఎస్సార్ కాంగ్రెస్ పెయిడ్ ఆర్టిస్టు

ysrcp paid artist viral video on social mediaఅమరావతిలో రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా రైతులు 33 రోజుల నుండి నిరసనలు తెలుపుతున్నారు. అయితే వారిని ప్రభుత్వం వారు అడుగడుగునా అవమానిస్తూనే ఉన్నారు. వారు పెయిడ్ ఆర్టిస్టులని, రియల్ ఎస్టేట్ ఏజెంట్లని, టీడీపీ కిరాయి మూకలని మంత్రులు సైతం తారచు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఇలా ఉండగా సీఎం జగన్ అయితే ఇప్పటి వరకూ వారికి భరోసాగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

ADVERTISEMENT

ఇది ఇలా ఉండగా రైతులను పెయిడ్ ఆర్టిస్టులని నిందించిన వైఎస్సార్ కాంగ్రెస్ తమ ప్రభుత్వం ఇమేజ్ పెంచుకోవానికి తామే పెయిడ్ ఆర్టిస్టులని రంగంలోకి దించింది. విషయానికి వస్తే ఒక ఆమె తనని తాను రాజధాని వాసిగా చెప్పుకుంటూ…. రైతులు ఎవరు ఆందోళన చెయ్యడం లేదని, తమ వీధుల్లోకి వచ్చి 500, 1000 రూపాయిలు ఇచ్చి నిరసనలు చేయిస్తున్నారని ఒక ఆమె సాక్షి టీవీతో చెప్పింది.

అసలు విషయం ఏమిటంటే సదరు మహిళ ఒక వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్త. ఆమెకు ఒక వీడియోలో మద్యం సేవిస్తూ జై జగన్ అంటూ నిందలు చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తుంది. రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ ప్రభుత్వమే పెయిడ్ ఆర్టిస్టులతో అడ్డంగా దొరికిపోయింది అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories