మళ్ళీ ‘క్రికెటర్’తో కనపడిన బాలీవుడ్ ‘హీరోయిన్’

zaheer Khan Bollywood Heroine sagarikaటీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ పెళ్లిలో ‘చక్ దే ఇండియా’ ఫేమ్ సాగరికతో కలసి భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ కనిపించడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, ఆరు నెలలుగా డేటింగ్ చేస్తున్నారని రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఆ వార్తలను వీరిద్దరూ ఖండించడంతో, సదరు హంగామాకు కాస్త బ్రేక్ పడింది.

అయితే తాజాగా హీరోయిన్ సాగరిక నటించిన ‘ఇరాదా’ సినిమా విడుదల సందర్భంగా ముంబైలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాగరికతో కలసి జహీర్ ఖాన్ కూడా హాజరయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య బంధం మరోసారి హైలైట్ అయ్యింది. అంతేగాక, వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారన్న వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది. ఈ కార్యక్రమానికి యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్, ఆశిష్ నెహ్రా, అజిత్ అగార్కర్ లు కాడా హాజరయ్యారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories