అతి త్వరలో… ఒక పెద్ద సంఘటన జరగబోతోంది..!

Zero the movieఅవును… అతి త్వరలో ఒక పెద్ద సంఘటన జరగబోతోంది. అయితే ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మరికొన్నాళ్ళు వేచిచూడాలి. ఎందుకంటే… ఇది ఒక సినిమా ప్రచారానికి సంబంధించిన విషయం. “జీరో – ఎ రొమాంటిక్ థ్రిల్లర్” పేరుతో తెరకెక్కుతున్న సినిమా పబ్లిసిటీలో భాగంగా ఈ పోస్టర్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ సినిమాను ఎవరు నిర్మిస్తున్నారు, ఎవరు దర్శకత్వం వహిస్తున్నారు, ఎవరు నటిస్తున్నారు అన్న విషయాలేవీ తెలియకుండా, సినిమాపై ఆసక్తి కలిగేలా కేవలం సినిమా టైటిల్ “జీరో”తో కూడిన పోస్టర్ ను మాత్రమే విడుదల చేసారు.

ప్రస్తుత పరిస్థితులలో ప్రేక్షకులను చిన్న సినిమాల వైపుకు ఆకర్షించాలంటే సాధారణ విషయం కాదు. బహుశా అలాంటి ఉద్దేశంతోనే ఎలాంటి వివరాలను ప్రకటించకుండా ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడానికి ఇలాంటి ప్రచారాన్ని కల్పిస్తున్నారని అవగతమయ్యే అంశం. గతంలో “ఐతే, ఈ రోజుల్లో” వంటి చిన్న సినిమాలు పబ్లిసిటీ పరంగా ఎలాంటి ‘ట్రెండ్’ను సృష్టించి, బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలను అందిపుచ్చుకున్నాయో తెలిసిందే. బహుశా ఆ కోవలేకే ఈ “జీరో” కూడా వెళుతుందేమో చూడాలి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories