సమాజంలో ప్రేమలు, పెళ్ళిళ్ళు, విడాకులు చాలా కామన్ ఇప్పుడు. మన దేశం కంటే అమెరికా, చైనా వంటి దేశాలు ఓ వందేళ్ళు ముందున్నట్లుగా, ఈ పెళ్ళిళ్ళ విషయంలో మన సినీ పరిశ్రమ ఎప్పుడూ చాలా ముందే ఉంటుంది. సహజీవనం చేయడం, బ్రేకప్‌లు సినీ పరిశ్రమలో సర్వసాధారణం.
సిఎం విజయ్, త్రిష ఇద్దరూ కూడా సినీ పరిశ్రమకు చెందినవారే కనుక వారు కూడా ఈ ట్రెండ్ కొనసాగిస్తున్నారు. సిఎం విజయ్ భార్య సంగీత విడాకులు ఇచ్చిన వెంటనే వారిద్దరూ కలిసి జంటగా ఓ పెళ్ళికి హాజరయ్యారు,
ఇప్పుడు విజయ్ సిఎం అయిన తర్వాత మళ్ళీ జంటగా కలిసి తిరుగుతున్నారు. వారి ఆదృష్టం కొద్దీ తమిళనాడు రాజకీయాలలో కూడా ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది. కనుక వారిని చూసి ఎవరూ హాశ్చర్యపడటం లేదు.
సిఎం విజయ్ భార్యకు విడాకులు ఇచ్చి విడిపోవాలనుకోవడం, త్రిషతో సహజీవనం చేయడం, ఇప్పుడు ఆమెని పెళ్ళి చేసుకోవాలనుకుంటే అవన్నీ పూర్తిగా వారి వ్యక్తిగత విషయాలే.
కానీ సూటుబూటు వేసుకొని వచ్చి రాష్ట్రంలో సమూలంగా మార్పు తెస్తానంటూ చెప్తున్న సిఎం విజయ్, మొదట తన వ్యక్తిగత జీవితంలోనే ఇటువంటి మార్పు తెచ్చుకోవడమే ఆసక్తికరం.
సినిమాలలో హీరో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తే అది అందరికీ వినోదం. కానీ రాష్ట్రాన్ని నడిపిస్తున్న వ్యక్తి ఈవిధంగా చేస్తే అది స్పూర్తిదాయకం కాదు.
సినిమాలు చూసి సిగరెట్స్ కాల్చడం, ఎక్కడ పడితే అక్కడ స్నేహితులతో మందు కొట్టడం నేర్చుకున్న యువత, ఈ విషయంలో కూడా తమ యువ సిఎం విజయ్ నుంచి స్పూర్తి పొందితే సమాజానికి పెను సమస్యగా మారుతుంది కదా?




