పెద్ది వల్గర్ కాంట్రవర్సీ.. ఏ.క్క.డా?

Ram Charan Clarifies Peddi Vulgarity

పెద్ది ప్రమోషన్స్ జోరందుకున్నాయి. రామ్ చరణ్, జాన్వికపూర్, బుచ్చిబాబు, దివ్యేందు, శివరాజ్ కుమార్ లు ఇండియా మొత్తం తిరుగుతూ, కుదిరినచోట ఇంటర్వ్యూలు ఇస్తూ ఏ న్యూస్ ఛానల్, యూట్యూబ్ చానల్, సోషల్ మీడియా చూసినా వాళ్లే కనిపిస్తున్నారు. ఫీడ్ మొత్తం పెద్ది తప్ప మరే సినిమా లేదు.

అయితే.. సాధారణంగా ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే రామ్ చరణ్, నార్త్ మీడియాకి కొన్ని ఇంటర్వ్యూలు, తమిళ, కన్నడ భాషల కోసం కొన్ని కామన్ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. వాటిలో నార్త్ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చాలా సీనియర్ జర్నలిస్ట్ అయిన నవిక కుమార్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ చెప్పిన సమాధానాలు, కొన్ని ప్రశ్నలకి ఓపిక పట్టిన తీరుని ప్రశంసించకుండా ఉండలేం.

ADVERTISEMENT

ఉపాసన పెళ్లి విషయంలో సీఈఓ లాగ వ్యవహరిస్తుందంటగా, వీక్లీ మీటింగ్స్ కూడా ఉంటాయంటగా, ఎప్పుడు, ఎక్కడికి డేట్ కి వెళ్లాలి అనేది కూడా షెడ్యూల్ చేస్తుందంటగా అని నవిక కుమార్ సంధించిన ప్రశ్నకి రామ్ చరణ్ చాలా హుందాగా అలాంటివేమీ ఉండదు. నటీనటుల షెడ్యూల్స్ చాలా ఆన్ ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. అందువల్ల కుదిరినప్పుడు ఫ్యామిలీ టైమ్ స్పెండ్ చేయడం తప్ప.. స్పెసిఫిక్ గా ఏదీ షెడ్యూల్ చేసుకోలేం అని సమాధానమిచ్చాడు.

అనంతరం పెద్ది సినిమాలోని రీసెంట్ గా రిలీజైన స్పెషల్ సాంగ్ విషయంలో ఏదో పెద్ద కాంట్రవర్సీ అయ్యిందంటగా అంటూ ప్రశ్నించగా.. అసలు అలాంటిదేమీ మా దాకా రాలేదు అని వివరణ ఇచ్చాడు చరణ్. జాన్వీ కూడా అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ.. ఆ ప్రశ్నను సదరు మహిళా జర్నలిస్ట్ మేల్ డామినేషన్ అంటూ దారి మళ్లించే ప్రయత్నం చేసినా.. చరణ్ దానికి కూల్ గా రెస్పాండ్ అయ్యాడు.

తెలుగులో అనంత్ శ్రీరామ్ రాసిన లిరిక్స్ లో కొన్ని చరణాలు ఎబ్బెట్టుగా ఉన్నాయని కొందరు విశ్లేషించిన మాట వాస్తవమే కానీ.. అసలు కాంట్రవర్సీ ఎక్కడ జరిగింది? సోషల్ మీడియాలో చూసిన కొన్ని పోస్టులు చూసి టీమ్ ని టార్గెట్ చేయడం తప్ప, అందులో కాంట్రవర్సీ ఏమీ జరగలేదు.

అయినా.. నార్త్ మీడియా కాబట్టి సదరు ప్రశ్న బయటికి వచ్చింది కానీ, ఇదే తెలుగు మీడియా ఇదే ప్రశ్న వేసి, పొరపాటున అది ఆన్ లైన్ ఎడిట్ బారీ నుండి తప్పించుకొని పోస్ట్ అయితే మాత్రం అర్జెంటుగా రిలేట్ చేయమనో లేక ఎడిట్ చేయమనో ఇక్కడి మీడియా సంస్థలకి పదుల సంఖ్యలో ఫోన్లు వచ్చేవి.

ADVERTISEMENT
Latest Stories