ఒక్క సెకన్ లో 31 హెచ్.డీ. సినిమాలు డౌన్ లోడ్!

internet-optical-fibreఇంటర్నెట్‌ డౌన్‌ లోడ్‌ స్పీడ్‌ లో ఇప్ప‌టికే ఎంతో ముందుకు దూసుకొచ్చిన టెక్నాలజీ మ‌రింత పురోగ‌తి సాధించే దిశ‌గా వెళుతోంది. ఇప్ప‌టికే డౌన్‌ లోడ్‌ స్పీడ్‌ 100 జీబీపీఎస్ ఉన్న‌ విష‌యం తెలిసిందే. ఆ వేగం మ‌రో 25 శాతం వృద్ధి చెంది 125 జీబీపీఎస్‌తో ప‌నిచేయ‌నుంది. అందుకోసం నోకియా సంస్థకు చెందిన బెల్‌-ల్యాబ్స్, జర్మనీలోని టెక్నికల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మునిచ్ సంయుక్తంగా కృషి చేస్తున్నాయి.

అందులో భాగంగా ఫైబర్‌ నెట్‌వర్క్ టెక్నాల‌జీని అభివృద్ధి చేసింది. ఈ స‌రికొత్త టెక్నాల‌జీని ప‌రిశీలించిన‌ డచ్‌ టెలికాం సంస్థ అందులో అభివృద్ధి చేసిన ప‌లు అంశాల‌ను గురించి వివ‌రించింది. ఈ సాంకేతిక‌తతో ఒక్క‌ సెకనుకు 125 జీబీ వేగంతో డేటాను బదిలీ చేయగలిగినట్లు పేర్కొంది. దీని ప్ర‌కారం ఒక్కోటి 4 జీబీ ఉంద‌నుకుంటే దానితో 31 హెచ్‌డీ సినిమాలు ఒక్క‌ సెకనులోనే డౌన్‌ లోడ్ అవుతాయ‌ని చెప్పింది.

ADVERTISEMENT

ఈ టెక్నాల‌జీ పొడవైన ఫైబర్‌ నెట్‌ వర్క్‌ లోనూ పని చేస్తుందని పేర్కొంది. ఇంటర్నెట్ వేగాన్ని అభివృద్ధి చేయ‌డానికి కొత్త‌ మాడ్యులేషన్ టెక్నాల‌జీని రూపొందించినట్లు చెప్పింది. ఈ సాంకేతిక‌త‌ డేటా బదిలీ వేగాన్ని 30 శాతం వరకు అభివృద్ధి చేస్తుంద‌ట‌. మొత్తమ్మీద పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం కొత్త తరం యువతను విశేషంగా ఆకర్షిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories