ప్రిన్స్ మహేష్ బాబుకు, 14 రీల్స్ నిర్మాణ సంస్థకు ఉన్న అనుబంధం తెలియనిది కాదు. మహేష్ తో వరుస సినిమాలను నిర్మించిన ఘనత ఒక్క 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థకే దక్కింది. ఈ నిర్మాణ సంస్థ తాజాగా నాని హీరోగా “కృష్ణగాడి వీరప్రేమగాధ” అని సినిమాను నిర్మిస్తోంది.
ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ లకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ నెల 18వ తేదీన ఈ సినిమా ఆడియోను విడుదల చేయబోతున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా ప్రిన్స్ మహేష్ బాబు రాబోతున్నారంటూ, 14రీల్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో మరోసారి ప్రిన్స్ అభిమానుల సందడికి సమయం ఆసన్నమైంది.
ADVERTISEMENT
ADVERTISEMENT





